బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీ కిచెన్ లో ఎప్పుడూ ఇవి ఉండేట్టు చూసుకోండి..
బరువు తగ్గాలనే ఏవేవో చేసేవారున్నారు. అయితే ఇలాంటి వారు కిచెన్ కొన్ని ఆహారాలు పక్కాగా ఉంచుకోవాలి. వాటివల్లే బరువు తగ్గడం సులువు అవుతుంది తెలుసా..?

బరువు పెరగడమంతా ఈజీ కాదు బరువు తగ్గడం. రోజులు, నెలలు కాదు.. సంవత్సరాలు కష్టపడాలి. అదికూడా ఎప్పుడో ఒకసారి కాదు.. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. మంచి డైట్ ను ఫాలో అయితే మీరు అనుకున్నంత తొందరగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకున్న వారు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ను అసలే తినకూడదు. తక్కువ కేలరీలు ఉండి.. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తినాలి. ఇలాంటి ఆహారాలు మీ వంటగదిలో ఎప్పుడూ ఉండేట్టు చూసుకోవాలి. అవి మీరు వేగంగా, ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓట్స్ లేదా ఓట్ మీల్
ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనిని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో లేదా సాయంత్రం అల్పాహారం గా కూడా తీసుకోవచ్చు. ఓట్స్ కి కొంచెం తేనె, పాలు కలిపితే తియ్యగా అవుతుంది. దీనిలో కొంచెం కోకో కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇలా తియ్యగా వద్దనుకుంటే నీటిలో ఉడికించి కొన్ని మసాలాలు, కొద్దిగా ఉప్పు, కావాలనుకుంటే కూరగాయలను కట్ చేసి కూడా వేసుకుని తింటే కూడా రుచి అదిరిపోతుంది.
బరువు తగ్గాలనుకున్న వారు ఏవి పడితే అవి తినరు. అందులోనూ ఫుడ్ ను చాలా వరకు తగ్గిస్తారు. ఉన్నట్టుండి ఫుడ్ ను తగ్గించడం వల్ల అప్పుడప్పుడు బాగా ఆకలి అవుతుంది. అలాంటప్పుడు ఓట్స్ మీల్ కు మీకు నచ్చిన పండ్లను లేదా గింజలు వంటివి కలిపి తీసుకోచ్చు.
వాల్ నట్స్
వాల్ నట్స్ ఆరోగ్యకరమైన చిరుతిండి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కొన్ని వాల్ నట్స్ ముక్కలను తిన్నా ఆకలి క్షణాల్లో దూరం అవుతుంది. కడుపు నిండిన భావన కూడా కలిగిస్తుంది. తీపి పదార్థలు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ప్యాకేజ్డ్ చిరుతిండి తినడానికి బదులుగా వాల్ నట్స్ ను తినండి. ఇవి మీ శీరరానికి కావాల్సిన అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఆకలిని కూడా తగ్గిస్తాయి.
గుడ్లు
మీ ఫ్రిజ్ లో ఏది ఉన్నా.. లేకున్నా కానీ గుడ్లు మాత్రం ఖచ్చితంగా నిల్వ ఉండాల్సిందే. ఇవి సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. గుడ్లు అంత ఖరీదైనవి కూడా కాదు. గుడ్లు ప్రోటీన్ భాండాగారం. బరువు తగ్గాలనుకున్నవారు గుడ్డును అస్సలు మిస్ కాకూడదు. అయితే పచ్చసొనను తీసేసి తెల్లసొనను తినాలి.
100 గ్రాముల గుడ్డు తెల్ల సొనలో 53 కేలరీలు, 0.6 గ్రాముల కార్భోహైడ్రేట్లు, 0.2 గ్రాముల కొవ్వు, 12 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుది. కాబట్టి కేలరీలు, కొవ్వు ఉండే ఫుడ్ ను తినకుండా గుడ్డుని తెల్లసొనను తినండి. తెల్ల సొన మీ కడుపును సులువుగా నింపుతుంది.
బీట్ రూట్
బీట్ రూట్ లో ఎన్నో పోషకాలుంటాయి. దీనిని సలాడ్ లేదా జ్యూస్ గా చేసుకుని తీసుకోవచ్చు. బీట్ రూట్ మీ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. మీ స్టామినాను పెంచుతుంది. ఉదయం లేదా ప్రీ వర్కౌట్ కు ఇది గొప్ప పానీయంగా చెప్పొచ్చు . ఈ జ్యూస్ మీ రక్తాన్ని నిర్వీషీకరణ చేస్తుంది.
ఆపిల్ పండు
ఆపిల్ పండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అందుకే బయటకు వెళ్లేటప్పుడు మీ బ్యాగులో ఆపిల్ పండు ఖచ్చితంగా ఉండేట్టు చూసుకోండి. ఆకలి అయినప్పుడు ఆపిల్ ను నీట్ గా కడిగి తినండి. ఆపిల్స్ లో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియను పెంచుతుంది. మీ గట్ లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఆహారం ఇస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.