- Home
- Life
- Pregnancy Avoid Food: ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని అస్సలు తినకూడదు.. లేదంటే ఆ సమస్యలు ఎదుర్కోక తప్పదు?
Pregnancy Avoid Food: ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని అస్సలు తినకూడదు.. లేదంటే ఆ సమస్యలు ఎదుర్కోక తప్పదు?
Pregnancy Avoid Food: ప్రతి స్త్రీ జీవితంలో గర్భాధారణ దశ ఎంతో మధురమైనది. అంతేకాదు అమ్మతనం పొందే ఆ దశలోనే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మన ఊహకందని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి గర్భిణులు తీసుకునే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.. లేదంటే..

Pregnancy Avoid Food: గర్భాధారణ సమయంలో ఆడవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారికి వారు ఫుడ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యానికి, తల్లి ఆరోగ్యానికి బలమైన ఆహారం ఎంతో అవసరం. అయితే గర్భిణులు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
తాజా కూరగాయలు, పండ్లు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలా మంది బద్దకం కారణంగా వీటిని కడకుండానే తినేస్తుంటారు. ఇలా చేస్తే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పండ్లను, కూరగాయలను బయటనుంచి తెచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగండి. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం మీతో పాటుగా మీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా అందుతుంది. కూరగాయలకు దుమ్ము దూళి, బ్యాక్టీరియా వంటివి అంటుకునే ప్రమాదముంది. అందుకే వాటినీ నీట్ గా కడిగి తినడం ఉత్తమం.
చిక్కని జున్ను: పలుచగా ఉండే జున్ను కంటే చిక్కటి జున్ను గర్భిణులకు ఏమాత్రం మంచిది కాదు. ఈ చిక్కటి జున్ను ఎంతో నష్టం కలిగిస్తుంది. అంతేకాదు ఈ చిక్కటి జున్నును తినడం వల్ల గర్భిణులు సౌకర్యంగా ఫీలవుతారు. ఈ జున్నులో కామేమ్బెర్ట్, బ్లెవు, ఫెటా, ప్రబీ వంటివి కలిగి ఉంటాయి. కాబట్టి గర్భిణులు చిక్కటి జున్నుకు దూరంగా ఉండటమే మంచిది.
పచ్చి గుడ్లు: పచ్చి గుడ్లు, పచ్చి మాంసాహారాన్ని గర్భిణులు తింటే వారికి సాల్మొనెల్లా అనే రోగాలు వచ్చేలా చేస్తాయి. అలాగే గుడ్లు, పిండితో చేసిన ఆహారాన్ని అస్సలు తీసుకోకండి. కేక్ బట్టర్, కస్టర్డ్ర్, ఇంట్లో చేసిన పిండి పదార్థాలు, ఎగ్నాగ్, ఐస్ క్రీం, మాయో వంటి వాటికి కూడా దూరంగా ఉండటమే బెటర్.
తీపి పదార్థాలు: గర్భిణులు తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. వైద్యలు సూచించిన విధంగా మీ శరీరానికి సరిపడా షుగర్ ను తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ మోతాదుకు మించి గర్భాధారణ సమయంలో తీసుకోకూడదు. ముఖ్యంగా గర్భంతో ఉన్నప్పుడు తీపిని ఎక్కువగా తీసుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయ్యాల్సి వస్తదని ప్రయోగాత్మకంగా నిరూపితమైంది.
పొప్పడి పండు: గర్భంతో ఉన్నప్పుడు తీసుకోకూడదని పండ్లల్లో పొప్పడి పండ్లు మొదటి స్థానంలో ఉంటాయి. ఎందుకంటే గర్భిణులు వీటిని తినడం వల్ల గర్భ సమయంలో లేదా శిశు జననం టైంలో అధిక రక్తస్రావమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ పండులో ‘లాటేక్స్’ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండును 3 నెలల తర్వాత దీన్ని అస్సలు తీసుకోకూడదని వైద్యులు సూచిస్తుంటారు.
మాంసం: డెలి మాంసాలు గర్భిణులకు అంతగా మంచివి కావు. ఎందుకంటే వీటిలో Listeriosis ల బారిన పడే గుణాలు కలిగి ఉండటంతో.. ఇవి తీసుకుంటే గర్భం పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఆహార పదార్థాలను గర్భ నిరోధక పదార్థాలుగా గుర్తించారు. ఎందుకంటే ఇవి శరీర వేడిని 165 డిగ్రీల వరకు పెంచేసి శిశువుకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి గర్భాధారణ సమయంలో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.