అందం పెరగాలంటే ఈ ఆహారాలను తప్పక తినండి..
ముందే ఇది చలికాలం. ఈ సీజన్ లో నీళ్లు సరిగ్గా తాగరు. దీనివల్ల చర్మం డ్రై గా మారుతుంది. అందులోనూ ఈ కాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాతావరణ కాలుష్యం, ఆహారంలో మార్పులు, ఒత్తిడి మొదలైన కారకాల వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల చర్మం రంగు మారడం, డ్రై గా మారడం, ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలేమీ రాకూడదంటే ఈ సీజన్ లో చర్మం పట్ల కాస్త జాగ్రత్త వహిస్తే చాలు.. అందంగా, ఆరోగ్యంగా ఉంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే మీ స్కిన్ అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అవేంటంటే..
జ్యూస్ లు
మీ ఆహారంలో కూరగాయలు, పండ్ల రసాలు, స్మూతీలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. కూరగాయల్లో, పండ్లలోని పోషకాలు చర్మం గ్లో తగ్గకుండా చూస్తాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మీరు కూరగాయలు, పండ్లను బాగా తింటే.. ఇతర పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వీటినుంచే మీ బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి .
ఆరెంజ్ జ్యూస్, దానిమ్మ జ్యూస్, దోసకాయ, బీట్ రూట్, అరటిపండ్లతో తయారు చేసిన స్మూతీలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆకు కూరలు
ఆకు కూరలు కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకు కూరల్లో విటమిన్ ఎ, జింక్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. బచ్చలికూర, బ్రోకలీ, పచ్చి ఉల్లిపాయ, సెలెరీ, దోసకాయ ఇవన్నీ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచడానికి సహాయపడతాయి. ద్రాక్ష, ఖర్జూరాలు, బాదం, వాల్ నట్స్, ఇతర నట్స్ లో విటమిన్లు, ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కాంపోనెంట్స్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేయడానికి సహాయపడతాయి. ఉదయం పూట వీటిని తినడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండటమే కాదు.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.
అల్లం, నిమ్మకాయ
ప్రతి ఇంట్లో అల్లం, నిమ్మకాయలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రెండు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చర్మ నష్టాన్ని మరమ్మతు చేయడానికి సహాయపడతాయి. అల్లం, నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. అలాగే చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోవడానికి సహాయపడతాయి.
విటమిన్ సి ఆహారాలు
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా చర్మానికి మేలు చేస్తాయి. నారింజ, ఆపిల్, స్ట్రాబెర్రీలు మొదలైన పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆరోగ్యాని ప్రయోజనకరంగా ఉంటుంది.