ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ అలవాట్లను వదులుకోవాల్సిందే.. లేదంటే..
ఈ రోజుల్లో చాలా చిన్నవయసు వారు సైతం నడుం నొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి తోడు దంతక్షయం కూడా చాలా మందిని బాధిస్తుంది. మీకు తెలుసా.. ఈ సమస్యలన్నీ మీ శరీరంలో కాల్షియం లేకపోవడం వల్లే వస్తాయి.

నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, దంతక్షయం వంటి సమస్యలు సాధారణంగా మన శరీరంలో కాల్షియం లోపిస్తేనే వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తింటూ ఉండాలి. అయితే వీటిని తిన్నా.. కొందరిలో కాల్షియం లోపం అలాగే ఉంటుంది. దీనికి కారణమేంటో తెలుసా..? ఎముకల నుంచి కాల్షియంను శోషించుకునే కొన్ని ఆహారాలు. వీటి వల్లే మీ శరీరంలో క్యాల్షియం తగ్గుతుంది. ఇది ఎముకలను బలహీనంగా చేస్తుంది. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం పదండి.
సోడియం
సోడియం ను తక్కువ మొత్తంలో తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఉప్పును ఎక్కువగా తింటే శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. దీంతో కాల్షియం లోపం ఏర్పడి బోలు ఎముకల వ్యాధి బారిన పడతారు. అంతేకాదు ఉప్పు ఎముకలను బలహీనపరుస్తుంది. దీంతో ఎముకలకు చిన్న దెబ్బతగిలినా విరిగిపోతాయి. ఆసియా పసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
తియ్యని ఆహారాలు
తియ్యటి ఆహారాలు ఎముకలను బలహీనపరుస్తాయి. అయినా స్వీట్లు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఎందుకంటే ఇవి ఎముకల నుంచి కాల్షియంను శోషించుకుకుంటాయి. దీంతో ఎముకలు బలహీనపడతాయి. అందుకే తీపి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండండి. టీ లో చక్కెర కలుపుకుని తాగడం మానుకోండి. ఇది శారీరాన్ని రిస్క్ లో పడేస్తుంది.
కాఫీ
టైం కుదుర్చుకుని మరీ కాఫీని కప్పులకు కప్పులు లాగించే వారు చాలా మందే ఉన్నారు. కానీ కాఫీ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది ఎముకల సమస్యలకు దారితీస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ ఎముకల నుంచి కాల్షియంను గ్రహిస్తుంది. దీంతో ఎముకలు బలహీనపడతాయి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం పదేపదే కాఫీని తాగడం మానేయండి.
Soda
సోడా
సోడా అంటే ఇష్టంలేని వారు ఉండరేమో. కానీ సోడా మీ పాణానికి అస్సలు మంచిది కాదు. దీన్ని తాగడం వల్ల మహిళల్లో తుంటి పగుళ్ల ప్రమాదం పెరుగుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. సోడా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం పెరుగుతుంది. ఎముకలు బలహీనపడుతాయి.
చికెన్
చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ 65 అంటూ చికెన్ తో ఏది చేసినా ఇష్టంగా లాగించే వారు చాలా మందే ఉన్నారు. అందులోనూ దీనిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని వారానికి మూడు నాలుగు సార్లు తినేవారు కూడా ఉన్నారు. మీకో విషయం తెలుసా.. చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కాల్షియం తగ్గుతుంది. చికెన్ ను ఎక్కువగా తింటే ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఇది ఎముకల నుంచి కాల్షియంను శోషించుకంటుంది. దీంతో రక్తంలో పిహెచ్ ను మారుతుంది. ఫలితంగా శరీరంలో క్యాల్షియం పరిమాణం తగ్గుతుంది. కాబట్టి చికెన్ ఎక్కువగా తినకండి.
ఆల్కహాల్
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్ ను తాగే అలవాటును మానుకోండని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేషనల్ బోలు ఎముకల వ్యాధి ఫౌండేషన్ ప్రకారం.. రోజుకు 2 నుంచి 3 గ్లాసుల కంటే ఎక్కువ మద్యం తాగడం వల్ల ఎముకలలో కాల్షియం తగ్గుతుంది. ఈ అలవాటు వల్ల మీ శరీరంలో ప్రమాదంలో పడుతుంది. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం ఆల్కహాల్ ను తాగడం మానేయండి.
పసుపు పాలు
మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు పసుపు పాలు బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం గ్లాస్ పాలకు చిటికెడు పసుపును వేసి రాత్రి పడుకునే ముందు తాగండి. ప్రతిరోజూ ఈ పసుపు పాలను తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా కాల్షియం లోపం కూడా పోతుంది. ఈ పాలు రోగనిరోధక వ్యవస్థను బలంగాచేస్తుంది.