health tips: కొలెస్ట్రాల్ ను ఇట్టే కరిగించే హెల్తీ డ్రింక్స్ ఇవిగో..
health tips: ఒంట్లో కొవ్వు నిల్వలు విపరీతంగా పెరిగిపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, హై బీపీ, డయాబెటీస్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా చూసుకోవాలి. అయితే కొన్ని రకాల డ్రింక్స్ కొలెస్ట్రాల్ ను ఐస్ లా కరిగిస్తాయి.. అవేంటంటే..

High Cholesterol
మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకడి మంచిది(హెచ్ డీఎల్). రెండోది చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్). మంచి కొలెస్ట్రాల్ తో మన శరీరానికి ఎటువంటి హానీ జరగదు. కానీ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతేనే ప్రమాదకరమైన గుండె జబ్బులు వస్తాయి. అయితే మన రక్తంలోంచి చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి మంచి కొలెస్ట్రాల్ ఎంతో సహాయపడుతుంది.
శరీరక శ్రమ లేకపోవడం, ఫుడ్ ను ఎక్కువగా తినడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, సమయానికి నిద్రపోకపోవడం, గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం వంటి కారణాల వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. అంతేకాదు శరీర బరువు పెరిగితే కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అప్పుడే చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకావం ఉండదు.
వ్యాయామాలు, మంచి ఆహారపు అలవాట్లు, సరైన సమయానికి నిద్రపోవడంతో పాటుగా కొన్ని డ్రింక్స్ ను తీసుకుంటే సులభంగా కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్ మిల్క్.. ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడానికి ఓట్ మిల్క్ దివ్య ఔషదంలా పనిచేస్తుందని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. ఓట్స్ లో ఉండే బీటా గ్లూకాన్ లు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి ఎంతో సహాయపడతాయి.
గ్రీన్ టీ.. ఈ గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, కాటెచిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి ఎంతో సహాయపడతాయని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. బ్లాక్ టీ కూడా కొలెస్ట్రాల్ ను కరిగించగలదని నిపుణులు చెబుతున్నారు. అయితే బ్లాక్ టీ కంటే గ్రీన్ టీనే తొందగరగా కొవ్వును కరిగించగలదని వెల్లడిస్తున్నారు.
సోయా పాలు.. కొవ్వును ఐస్ లా కరిగించడంలో సోయా పాలు దివ్య ఔషదంలా పనిచేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సోయా పాలల్లో శాచ్యురేటెడ్ కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచడానికి ఎంతో సహాయడుతుంది. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ ను కరిగించుకోవాలనుకునేవారు మామూలు పాల కంటే సోయా పాలు తీసుకోవడం ఉత్తమం.
టొమాటో.. టొమాటోలల్లో ఉండే లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి ఎంతో సహాయపడుతుంది.అలాగే లిపిడ్ లెవెల్స్ ను కూడా మెరుగుపరుస్తుంది. అయితే ఈ లైకోపీన్ లెవెల్స్ పెరగాలంటే టొమాటోలను జ్యూస్ గా చేయాలని పరిశోధనలు చెబుతున్నాయి. టొమాటో రసం లో నియాసిన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి.
acai berry
బెర్రీ స్మూతీస్.. బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీలల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను కరిగించడానికి తోడ్పడతాయి. అంతేకాదు వీటిలో కొవ్వులు, కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. దీనివల్ల మచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుప్పెడు బెర్రీలను తీసుకుని స్మూతీగా చేసిపెట్టుకోండి. అందులో 1/2 చొప్పున కూల్ వాటర్, పాలను పోసి బాగా కలిపి తాగితే మంచిది.
ఈ డ్రింక్స్ తో పాటుగా ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మంచి కొవ్వులను పెంచే పీచు పదార్థం ఎక్కువగా ఉండే కాయగూరలు, ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కాల్షియం పుష్కలంగా ఉండే గుడ్లు, పాలు, పండ్లను, చేపలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
అలాగే స్మోకింగ్, డ్రింకింగ్, ధ్యానం,వ్యాయామాలను నిత్యం చేస్తూ ఉండాలి. అలాగే మొలకెత్తిన గింజలు, అవిసె గింజలు, గ్రీన్ టీ, వంటివి తరచుగా తీసుకుంటూ ఉండాలి. వీటివల్ల మన రక్తంలో మంచి కొవ్వులు పెరుగుతాయి.