MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Depression : మగవారు డిప్రెషన్ తో బాధపడితే ఇలా ఉంటారు..

Depression : మగవారు డిప్రెషన్ తో బాధపడితే ఇలా ఉంటారు..

Depression : ఆడవారికంటే మగవారే డిప్రెషన్ తో ఎక్కువ భాదపడుతున్నట్టు పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. అయితే ఈ బాధనుంచి బయటపడే దిశగా వారు ఆలోచించడం లేదట. ముఖ్యంగా వీరిలో డిప్రెషన్ తాలూకా లక్షణాలు ఉన్నాయని గుర్తించినప్పటికీ ఇతరులకు చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. దీనివల్ల వీరు మరిన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 28 2022, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

Depression : మనుషులన్నాక డిప్రెషన్ కు గురవడం సహజమే. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఎలాంటి తేడాలు లేకుండా  డిప్రెషన్ బారిన పడుతుంటారు. ఇదొక మానసిక వ్యాధి. ఈ డిప్రెషన్ సాధారణమైనదిగా కనిపించినప్పటికీ ఇది వారి ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తుంది. 

 

210

పలు అధ్యయనాల ప్రకారం.. మగవారి కంటే ఆడవారే ఎక్కవగా డిప్రెషన్ కు గురవుతుంటారని వెల్లడైంది. కానీ మరికొన్ని అధ్యయనాలు ప్రకారం.. ఆడవారి కంటే మగవారే ఎక్కువగా డిప్రెషన్ తో బాధపడుతున్నారట. 
 

 

310

పురుషులే ఎక్కువగా డిప్రెషన్ బారిన పడుతూ మానసికంగా క్రుంగిపోతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తమ మనసులో ఉండే భావాలను బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. సామాజిక పరిస్థితుల కారణంగా తమ మనసులో  ఉండే భావాలను ఇతరులకు చెప్పలేక అంతా బాగానే ఉంది అంటూ పైకి హుందాగా కనిపిస్తూ..తమ భావోద్వేగాలను లోపలే అణదొక్కుకుంటున్నారట. 
 

410

దీనివల్ల వారు మరింత డిప్రెషన్ కు లోనయ్యి తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమి, వెన్నునొప్పి, లైంఘిక సమస్యల గురించి ఆలోచించి మానసికంగా మరింత క్రుంగిపోతున్నారు. అందుకే మగవారిలో వచ్చే డిప్రెషన్ న్ను గుర్తుపట్టడం అంత సులభం కాదు.

510

లక్షణాలు:  డిప్రెషన్ కు గురైన మగవారిని కొన్ని లక్షణాల ద్వారా ఈజీగా గుర్తించవచ్చు. డిప్రెషన్ మానసికమైనదే అయినప్పటికీ దీని ప్రభావం శారీరకంగా కూడా ఉంటుంది. వాటిని బట్టే వారు డిప్రెషన్ కు గురవుతున్నారో లేదో తెలుసుకుని వైద్యులకు చూపించవచ్చు.
 

610

డిప్రెషన్ తో బారిన మగవారిలో గ్యాస్, మలబద్దకం, గుండెల్లో దడ, డయేరియా, తలనొప్పి, జీర్ణ సమస్యలు, లైంఘిక సమస్యల, అంగస్తంభన, హార్మోన్ల అసమతుల్యత, టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండటం, అకస్మత్తుగా బరుపు పెరగడం, తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

710
depression men

depression men

డిప్రెషన్ తో బాధపడేవారు కొన్ని కొన్ని సార్లు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహోద్యోగులకు దూరంగా ఉండటం  చేస్తుంటారు. అలాగే పనిపై శ్రద్ధ ఉండదు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగానే ఉంటారు. ఊరికే అరవడం, కోప్పడటం, దూకుడుగా ప్రర్తించడం, నిస్సహాయతగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. 

810

ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది ఇతరులతో పంచుకున్నప్పుడే దాని నుంచి కాస్త రిలీఫ్ లభిస్తుంది. ఈ సమాజం ఏమనుకుంటుందోనని మనసులో ఉన్న భావాలను బయటపెట్టకపోతే వారు మరింత క్రుంగిపోయి.. అనేక రోగాలకు దారితీసి ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉంది. 

910
depression

depression

ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది ఇతరులతో పంచుకున్నప్పుడే దాని నుంచి కాస్త రిలీఫ్ లభిస్తుంది. ఈ సమాజం ఏమనుకుంటుందోనని మనసులో ఉన్న భావాలను బయటపెట్టకపోతే వారు మరింత క్రుంగిపోయి.. అనేక రోగాలకు దారితీసి ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉంది. 

1010

డిప్రెషన్ తో బాధపడితే వెంటనే మానసిక వైద్యులను సంప్రదించండి. దీనివల్ల మీరు ఆ సమస్య నుంచి తొందరగా బయటపడతారు. వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తే డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడతారు.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Holi Colour Removal: బట్టలపై పడిన హోలీ కలర్స్ వదిలించేదెలా?
Recommended image2
Kitchen Hack: ఇలా చేస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎప్పటికీ పాడవ్వవు..
Recommended image3
Rice Water: బియ్యం నీటిలో వీటిని కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved