మీరు తెలివైన వారు అని చెప్పడానికి ఈ లక్షణాలు చాలు..!
ఫ్రెంచ్ స్టడీలో తేలిన విషయం ప్రకారం.. చాలా బక్కగా ఉండేవారు.. ముఖ్యంగా బీఎంఎస్( Body mass Index) విలువ 20 అంతకంటే తక్కువ ఉన్నవారిని కూడా చాలా తెలివిగల వారుగా గుర్తిస్తారట.

ప్రతి ఒక్కరూ తమను తాము తెలివైన వారుగా నిరూపించుకోవాలని , అందరూ తమను తెలివైన వారుగా గుర్తించాలని చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు. అయితే.. ఎదుటివారు మిమ్మల్ని తెలివైన వారుగా గుర్తించాలి అంటే.. కొన్నిలక్షణాలు ఉండాలంట. ఈ కింద లక్షణాలు ఉన్నవారిని ఎవరైనా సరే తెలివైన వారుగా గుర్తిస్తారట. మరి ఆ లక్షణాలేంటో ఓసారి చూద్దామా..
మీరు గమనించారో లేదో... చాలా మంది ఎడమ చేతితో పనులు చేస్తూ ఉంటారు. సాధారణంగా మనం కుడి చేతితో పనులు చేస్తే.. చాలా కొద్ది మంది మాత్రమే.. ఎడమ చేతితో రాయడం లాంటివి చేస్తుంటారు. వారిని లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్ గా పిలుస్తారు. ఇలాంటి లెఫ్ట్ హ్యాండెడ్ పీపుల్స్ ని తెలివిగల వారుగా పరిగణిస్తారట. ఎథినీస్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ విషయం నిరూపితమైందట.
అంతేకాదు.. ఎప్పుడూ సరదాగా ఉంటూ.. ఎదుటివారిని నవ్విస్తూ ఉండేవారు.. అంటే కమెడియన్స్ చాలా తెలివిగల వారట. 1970 లో చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైందట. వారి ఐక్యూ లెవల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారట.
ఫ్రెంచ్ స్టడీలో తేలిన విషయం ప్రకారం.. చాలా బక్కగా ఉండేవారు.. ముఖ్యంగా బీఎంఎస్( Body mass Index) విలువ 20 అంతకంటే తక్కువ ఉన్నవారిని కూడా చాలా తెలివిగల వారుగా గుర్తిస్తారట.
నార్వేగాన్ సర్వే ప్రకారం... ఇంట్లో మొదట పుట్టిన పిల్లలు కొంచెం తెలివిగా ఉంటారట. వారిలో ఐక్యూ లెవల్స్ కూడా ఎక్కువగా ఉంటాయట. తమకన్నా చిన్నవారితో పోలిస్తే.. వారు తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారట.
మాడ్రిడ్ యూనివర్శిటీ చేసిన సర్వే ప్రకారం... రాత్రిపూట పడుకోకుండా ఎక్కువ పనిచేసేవారిలో ఇతరులతో పోలిస్తే.. ఎక్కువ ఐక్యూ లెవల్స్ ఉంటాయట. పగలు పనిచేసేవారితో పోలిస్తే.. వీరి ఐక్యూ లెవల్స్ ఎక్కువగా ఉంటాయట.
అంతేకాదు.. దాదాపు 60శాతం తెలివితేటలు ఎక్కువగా ఉండేవారు.. ఇంట్రావర్ట్స్ గా ఉంటారట. తొందరగా ఎవరితోనూ మాట్లాడలేరు. కలవలేరు కూడా. ఇవి కాకుండా.. క్యూరియాసిటీ ఎక్కువగా ఉండేవారికి కూడా తెలవితేటలు ఎక్కువగా ఉంటాయట. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ చేసిన సర్వేలో ఈ విషయం తేలింది.
బ్రెజిల్ శాస్త్రవేత్తలు దాదాపు 6 వేల మంది పై చేసిన సర్వేలో తేలిన ప్రకారం.. పాలు తాగే పిల్లల్లో ఐక్యూ లెవల్స్ ఎక్కువగా ఉంటాయట. ప్రతి ఒక్కరూ పాలు తాగే వయసులో.. చాలా ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారట.