కాలికి మెట్టెలు పెట్టుకోవడం ఫ్యాషన్ కాదు, సంప్రదాయం. ఇక్కడ అందమైన వెండి మెట్టెల డిజైన్లను ఇచ్చాము. వీటి ధర రూ.1500 కన్నా తక్కువే ఉంటాయి.
ఇవి పైప్ మెట్టెల డిజైన్. వీటిని ఉంగరాల్లా ధరించాలి. వీటిని టైట్ లేదా లూజ్ చేసుకోవచ్చు. ఇవి చూసేందుకు నిండుగా కనిపిస్తాయి.
రోజువారీ వాడకానికి బొటనవేలితో పాటు సింపుల్ రౌండ్ షేప్ వెండి మెట్టెలు ఇవి. ప్రతిరోజూ ధరించడానికి పర్ఫెక్ట్. వటిని రూ.1000-1200 లోపు కొనుగోలు చేయవచ్చు.
చిక్ ఫ్లవర్ స్టైల్ వెండి మెట్టెల డిజైన్ ఇది. ఇవి డబుల్ చైన్‌తో కలిసి అందమైన లుక్‌ను ఇస్తాయి.
ఆఫీసుకు వెళ్లే మహిళలు ఈ మెట్టెలు తేలికగా ఉండి క్లాసీగా కనిపిస్తాయి. మీరు కూడా వీటిని ధరించవచ్చు.
హార్ట్ షేప్ డిజైన్ పెండెంట్లు, చెవిపోగుల్లాగే వెండి మెట్టెలు కూడా వచ్చేశాయి. మీరు కూడా వీటిని ప్రయత్నించవచ్చు.
ఫిలిగ్రీ వర్క్, మీనాకారి రంగురంగుల రాళ్లతో వచ్చే జోధా మెట్టెలు ఎవరికైనా నప్పుతాయి. ఇవి సింగిల్ మెట్టెల నుండి 4 పీసుల సెట్‌లో లభిస్తాయి.