కారణం లేకుండా ఏడుస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
కారణం లేకుండా ఏడవడం ఒక మానసిక సమస్య అంటున్నారు మానసిక నిపుణులు. ఇలా ఏడవడానికి ప్రధాన కారణాలలో డిప్రెషన్ ఒకటి. అలాగే ప్రెగ్నెంట్ గా ఉన్నవారు కూడా కారణం లేకుండా ఏడుస్తారంట. ఎందుకంటే..

ఏడవటం కూడా ఒక ఫీలింగే. ఏడుపు మనిషికి అవసరం కూడా. ఏడుపు వల్ల మనిషిలోని బాధంతా పోతుంది. అలాగే శరీరంలో ఎన్నో హార్లోన్లు రిలీజ్ అయ్యి వ్యక్తిని హ్యాపీగా ఉంచుతాయి. అప్పుడప్పుడు ఏడవడం సర్వసాధారణ విషయమే అయినప్పటికీ.. కొంతమంది మాత్రం ఎలాంటి కారణం లేకుండానే ఏడుస్తుంటారు.
సినిమా చూసుకుంటూనే, మాటల మధ్యలోనే వారికి తెలియకుండానే ఏడుస్తుంటారు. అందులో మగవారి కంటే ఆడవాళ్లే అలా ఎక్కువగా ఏడుస్తారని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
కారణం లేకుండా ఏడవటం కూడా ఒకమానసిక సమస్యే అంటున్నారు మానసిక నిపుణులు. కొంతమంది ఏదో బాధకలిగి ఏడిస్తే.. మరికొంతమంది ఆనందం ఎక్కువయ్యి ఏడుస్తారు. బాధ, ఆనందం, కోపం, దుఖ: , ఆందోళన, అలసట.. ఇలా వచ్చే ఫీలింగ్స్ కు ఏడవడం కొత్త విషయమేమీ కాదు కానీ.. కొంతమంది మాత్రం ఎలాంటి కారణం లేకుండా ఏడుస్తుంటారు.
ాఇలా ఏడవటానికి కారణాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే.. డిప్రెషన్, అలసట, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వల్ల ఏడుస్తారంట.
డిప్రెషన్ లో ఉన్నవాళ్లు.. కారణం లేకుండా ఏడిచే కారణాలలో డిప్రెషన్ ఒకటి. డిప్రెషన్ లో ఉన్నవాళ్లు జరిగిపోయిన విషాదాన్ని గురించి గానీ, ఏదైనా ఒక విషయం గురించి కానీ కొన్నిరోజుల పాటు బాధపడుతూనే ఉంటారు. ఒక విషయం గురించి ఎక్కువ కాలం ఆలోచించేవారు డిప్రెషన్ లోకి వెళ్లి సడెన్ గా ఏడుస్తూ ఉంటారు.
ప్రెగ్నెంట్ ఉన్నవారు.. ఎలాంటి కారణం లేకుండా గర్భిణులు కూడా అప్పుడప్పుడు ఏడుస్తుంటారు. ఎందుకంటే గర్భంతో ఉన్నప్పుడు వారి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ కారణంగా కూడా వాళ్లు ఏడుస్తారు.
ఇలాంటి సమయంలో వైద్యుడిని సంప్రదించడం అవసరం.. డిప్రెషన్, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని తెలిస్తే వెంటనే వైద్యుడిని లేదా సైకాలజిస్టును కలవండి. ఇలా క్రుంగిపోతే.. అది మీ ప్రాణాలకే ప్రమాదం కావొచ్చు. మీ సమస్య ఏంటో వాళ్లకు వివరించి.. దాన్నుంచి ఎలా బయటపడాలో సలహాలు , సూచనలు తీసుకోండి. ఆ దిశగా మీ లైఫ్ స్టైల్ ను మార్చుకోండి.