MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • High cholesterol: మీ శరీరంలో హై కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి ఇవే అసలు కారణాలు

High cholesterol: మీ శరీరంలో హై కొలెస్ట్రాల్ పేరుకుపోవడానికి ఇవే అసలు కారణాలు

High cholesterol: కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమైనదే. కానీ అది అధికంగా శరీరంలో పేరుకుపోతే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీర కణాల నిర్మాణానికి, హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన కొలెస్ట్రాల్ అధికంగా శరీరంలో చేరడనికి కొన్ని కారణాలు ఉన్నాయి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 16 2025, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హై కొలెస్ట్రాల్ శరీరంలో చేరితే...
Image Credit : Getty

హై కొలెస్ట్రాల్ శరీరంలో చేరితే...

కొలెస్ట్రాల్ మనకు అవసరమైనదే. అది శరీర కణాల నిర్మాణానికి, హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన కొవ్వు పదార్థం. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా చేరితే మాత్రం సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా "చెడు" (LDL) కొలెస్ట్రాల్, ధమనులలో పేరుకుపోతుంది.  దీనివల్ల గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈ అలవాట్లు
Image Credit : Getty

ఈ అలవాట్లు

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం, అధిక కొలెస్ట్రాల్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 4.4 మిలియన్ల మంది అనేక అనారోగ్యాల వల్ల మరణిస్తున్నారు.  కొన్ని రోజువారీ అలవాట్లు శరీరంలో  కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడానికి కారణం అవుతుంది. 

36
నూనె వాడకం
Image Credit : Getty

నూనె వాడకం

ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు మంచివే కానీ నూనెతో నిండిన ఆహారాలు అధికంగా తింటే మాత్రం మంచిది కాదు. నూనెలో వేయించిన పదార్థాలు తక్కువగా తినాలి. నూనె వాడకాన్ని కూడా చాలా వరకు తగ్గించాలి. నూనె ఎంత తక్కువగా తీసుకుంటే అంత ఆరోగ్యం. నూనె అధికంగా వాడితే  అధిక కేలరీలు చేరి LDL కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

46
ఇలా స్నాక్స్
Image Credit : Getty

ఇలా స్నాక్స్

వేయించిన, కరకరలాడే స్నాక్స్ తినేందుకు రుచిగా ఉంటాయి. కానీ అవి శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ చేరడానికి కారణం అవుతాయి. ఆ స్నాక్స్ వల్ల శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్స్ చేరుతాయి.  ఇవి గుండె జబ్బులను పెంచేస్తాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల లిపిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి కారణం అవుతుంది.

56
నెయ్యి మితంగా
Image Credit : istock

నెయ్యి మితంగా

ఇంట్లో నెయ్యి, వెన్న అధికంగా వాడుతూ ఉంటారు. అవి రుచిగా ఉంటాయి. కానీ అతిగా తింటే మాత్రం కొలెస్ట్రాల్ గా మారిపోతాయి. కాబట్టి నెయ్యి, బటర్ వాడకం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది.

66
వీటిని తినండి
Image Credit : Getty

వీటిని తినండి

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కరిగే ఫైబర్ రక్తంలోకి చెడు కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుందని మాయో క్లినిక్ చెబుతోంది. రోజూ 10 గ్రాముల ఫైబర్ తినడం వల్ల గుండె జబ్బుల మరణ ప్రమాదం 17 శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక ఉప్పు వాడకం రక్తపోటుకు దారితీస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక చక్కెర ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. బ్రెడ్, సాస్‌లలో ప్రమాదకరమైన చక్కెర ఉంటుందని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ చెబుతోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kasula Chain: లైట్ వెయిట్ కాసుల చైన్.. చూస్తే వావ్ అనాల్సిందే
Recommended image2
Idli Batter: వర్షాకాలంలోనూ ఇడ్లీ, దోశ పిండి పర్ఫెక్ట్ గా పులియాలా? ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు
Recommended image3
Vastu: ఎప్పుడుపడితే అప్పుడు దుస్తులు ఉతికితే కష్టాలు మీ వెంటే.. ఈ తప్పులు చేయకండి
Related Stories
Recommended image1
సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?
Recommended image2
చలికాలంలో పగిలిన పెదవులకు తేనే పూస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved