ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాలు ..
Immunity Booster Foods: కరోనా కాలం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని బారిన పడకుండా ఉండాలంటే మనలో రోగ నిరోధక శక్తి తగినంతగా ఉండాల్సిందే. అయితే కొంతమందిలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. వీళ్లే అనేక రోగాల బారిన పడుతుంటారు. అయితే వీరు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అవేంటంటే..

కరోనా ఇంకా మనల్ని పూర్తిగా వదిలి పోలేదు. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందకు ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చేతులు తరచుగా శుభ్రంచేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటి జాగ్రత్తలను పాటిస్తూనే ఉన్నారు. క్రమం తప్పకుండా వీటిని పాటించడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే చాలా మంది రోగ నిరోధక శక్తి లోపంతో బాధపడుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ తగ్గిన వారు తొందరగా అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్, ఫ్లూ, దగ్గు వంటి రోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటి నుంచి తొందరగా బయటపడాలంటే ఇమ్యూనిటీ పవర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. కాగా ఇమ్యూనిటీ పవర్ ను పెంపొందించడంలో కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే..
సిట్రస్ ఫ్రూట్స్: ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సిట్రస్ ఫ్రూట్స్ ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం నిమ్మ, టాన్జెరిన్, నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ ఫ్రూట్స్ ను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. ఈ సిట్రస్ పండ్లలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఈ పండ్లు ఇమ్యూనిటీని పెంచడానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి White blood cells ఉత్పత్తిని పెంచుతుంది.
బ్రోకొలీ: ఇందులో విటమిన్ ఎ, ఇ, సి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి మెండుగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి.
రెడ్ క్యాప్సికమ్: దీనిలో బీటా కెరోటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. రెడ్ క్యాప్సికమ్ లో ఉండే బీటా కెరోటీన్ మనం తిన్నతర్వాత అది విటమిన్ ఏ గా మారి మన కళ్లు, స్కిన్ ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇక ఇందులో ఉంటే విటమిన్ సి స్కిన్ కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ఈ రెడ్ క్యాప్సికమ్ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
వెల్లుల్లి: కూరలను టేస్ట్ గా చేయడంతో పాటుగా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో వెల్లుల్లి ముందుంటుంది. ఇది మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వెల్లుల్లిలో ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేసే లక్షణాలు ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
పసుపు: పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఇది Anti-inflammatory గుణాలను కలిగి ఉండటంతో మనం అనేక రోగాల నుంచి తప్పించుకోవచ్చు. కూరల్లో పసుపును వేయడం వల్ల కూర టేస్ట్ గా అవడమే కాదు ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు ఎంతో సహాయపడుతుంది.
అల్లం: అల్లం ఎన్నో దివ్య ఔషదాలను కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థ కు సంబంధించిన రోగాలు, వాంతులు, గొంతునొప్పి, వికారం, దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి అల్లం ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు అల్లం మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.