గడ్డం అందంగా, ఆరోగ్యంగా పెరగాలా..? ఈ ఆయిల్స్ వాడండి...!
తమ గడ్డం ఒత్తుగా, అందంగా ఉండాలని ప్రతి అబ్బాయి కోరుకుంటారు. తల వెంట్రుకలతో పాటు.. గడ్డం కూడా అందంగా పెరగాలి అంటే కొన్ని నూనెలు వాడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

అబ్బాయిలు గడ్డంతో చాలా మ్యాన్లీగా కనిపిస్తారు. కొందరికి అబ్బాయిలు క్లీన్ షేవ్ తో ఉంటే నచ్చుతారు. కానీ కొందరికి మాత్రం.. అబ్బాయిలు గడ్డంతో ఉంటేనే ఎక్కువగా ఇష్టపడతారు. ఇతరల సంగతి పక్కన పెడితే.. తమ గడ్డం ఒత్తుగా, అందంగా ఉండాలని ప్రతి అబ్బాయి కోరుకుంటారు. తల వెంట్రుకలతో పాటు.. గడ్డం కూడా అందంగా పెరగాలి అంటే కొన్ని నూనెలు వాడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ నూనెలేంటో ఓసారి చూద్దాం...
1.గడ్డం సహజంగా ఒత్తుగా పెరగాలంటే....అబ్బాయిలు బాదం నూనెను ఉపయోగించాలట. బాదం నూనెను తరచూ రాయడం వల్ల గడ్డం చాలా ఒత్తుగా, అందంగా పెరుగుతుందట.
castor oil
2.ఆముదం చాలా మంది జుట్టు పెరగడానికి వాడతారు. ఈ ఆయిల్ గడ్డం పెరగడానికి కూడా ఉపయోగించవచ్చు. ఆముదం రాయడం వల్ల స్కిన్ ఎలర్జీలు రాకుండా ఆపగలదట. అంతేకాకుండా.. జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుందట.
olive oil or coconut oil
3.మనం పెద్దగా పట్టించుకోము కానీ.. కొబ్బరి నూనెకు మించిన మంచి ఆయిల్ మరోటి ఉండదు. ప్రతిరోజూ ముఖాన్ని, గడ్డాన్ని కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే... గడ్డం ఒత్తుగా, బలంగా పెరుగుతుందట.
లావెండర్ ఆయిల్... ఈ నూనె జుట్టు రాలే సమస్యను తగ్గించి... ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇక గడ్డం పెరగడానికి అబ్బాయిలు ఉపయోగించాల్సిన మరో నూనె ఆలివ్ ఆయిల్. ఇందులో ఒమేగా 3 ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి.
రోజ్ మేరీ ఆయిల్...మీ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలి అనుకుంటే... రోజ్ మేరీ ఆయిల్ మీకు బెస్ట్ ఛాయిస్.
టీ ట్రీ ఆయిల్.. ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి. కాబట్టి.. ఈ నూనె కూడా మీ గడ్డం అందంగా పెరగడానికి సహాయపడుతుంది.