ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా.. వీటిని మాత్రం కొనరు..!
డబ్బు ఉన్నా కొనలేని వస్తువులు ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తున్నారా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజమట. మిలీనియర్లు.. డబ్బులను నిర్వహించడంలో చాలా తెలివిగా ఉంటారట.

money
ఈ ప్రపంచంలో డబ్బుకి ఉన్న విలువ దేనికీ లేదు. ఈ ప్రపంచాన్ని డబ్బే నడిపిస్తుంది. డబ్బు ఉన్నవాడి మాటే చెల్లుతుంది. వారి రాజ్యమే ఏలుతుంది. ఎవరు నమ్మినా.. నమ్మకున్నా ఇదే ప్రస్తుతం సమాజంలో జరుగుతుంది. అయితే.. మనమంతా అనుకుంటాం.. డబ్బు ఉన్నవారు దేనినైనా కొనుగోలు చేస్తారు. అని అనుకుంటారు. కానీ.. ఎన్ని కోట్ల రూపాయిల ఆస్తులు ఉన్నా కూడా.. ఈ కింద వాటిని మాత్రం వారు కొనరట.
డబ్బు ఉన్నా కొనలేని వస్తువులు ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తున్నారా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజమట. మిలీనియర్లు.. డబ్బులను నిర్వహించడంలో చాలా తెలివిగా ఉంటారట. మిలీయనర్లు.. ఎప్పుడూ అత్యంత ఖరీదైన వస్తువులు కొంటారు.. వారు ఎప్పుడూ సరదాగా గడుపుతారు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ.. వారు అలా చేయరట. కేవలం తమ హోదాని నిలుపుకోవడానికి డబ్బును ఎలా ఆదాయా చేయాలి..? ఎలా నిర్వహించాలి అనే విషయాలను మాత్రమే ఆలోచిస్తారట.
వారు నిత్యం తమను తాము డబ్బున్నవారుగా గుర్తించడాన్ని ఇష్టపడతారు.. కానీ.. ఖరీదైన వస్తువులు కొని ప్రదర్శించాలని అనుకోరట. మిలీనియర్లు అస్సలు కొనుగోలు చేయని మూడు వస్తువులు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
వారు చాలా డబ్బు సంపాదిస్తారు కాబట్టి, వారు మార్కెట్లో అత్యంత విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడం కరెక్ట్ అని అందరూ అనుకుంటారు. కానీ వారు.. అత్యంత ఖరీదైన లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయరట. ముఖ్యంగా దుస్తుల విషయంలో.. అలాంటి పొరపాటు చేయరట. వారు మహా అయితే.. వెయ్యి డాలర్లు ప్రైజ్ ట్యాగ్ ఉన్న దుస్తువులను కొనుగోలు చేస్తారు. ఎంత డబ్బున్నా.. ఎంత సింపుల్ గా ఉన్నారు.. అని అందరూ అనుకోవాలని వారు భావిస్తారట.
చాలా మంది మిలియనీర్లు తమ కార్ క్రేజ్‌ను కనిష్టంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. వారు ఫెరారీని కొనుగోలు చేయవచ్చు, కానీ వారు మార్కెట్‌లోని మెర్క్స్, మేబ్యాక్‌లు లేదా ఇతర విలాసవంతమైన కార్లపై విచ్చలవిడిగా కొనుగోలు చేయరు. అన్నీ లగ్జరీ కార్లే కొనరు. ఒకటి, రెండు లగ్జరీ కార్లు ఉన్నా.. ఇతర సాధారణ రేంజ్ కార్లు కూడా కొనుగోలు చేస్తారట.
మార్క్ జుకర్‌బర్గ్ తన సంపదలో కేవలం 0.01% ఉన్న నివాసంలో నివసిస్తున్నారు. చాలామంది దీనిని నమ్మరు, కానీ ఇదే నిజం, డబ్బు ఉంది కదా.. తమ సంపాదనకు తగినట్లు ఖరీదైన భవనాన్ని నిర్మించుకోరట. దాని నిర్వహణకు మరింత ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి.. టూమచ్ లగ్జరీ కాకుండా చూసుకుంటూ ఉంటారట. వారి సంపాదనలోని చాలా తక్కువ మొత్తాన్ని వారు ఇంటి కోసం ఉపయోగిస్తారట.