Hair Growth: ఈ నాలుగు విటమిన్లు తీసుకున్నా, జుట్టు రాలదు..!
సరైన ఆహారపు అలవాట్లు ఫాలో కాకపోవడం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, రసాయనాలు ఉన్న షాంపూలు, నూనెలు వాడటం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఈ సమస్య ఎండాకాలం మరింత ఎక్కువగా ఉంటుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
జుట్టు రాలడానికి చెక్ పెట్టేదెలా?
ఈరోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ జుట్టు రాలడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం, సరైన ఆహారపు అలవాట్లు ఫాలో కాకపోవడం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, రసాయనాలు ఉన్న షాంపూలు, నూనెలు వాడటం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఈ సమస్య ఎండాకాలం మరింత ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు.. మన శరీరంలో కొన్ని విటమిన్ల లోపం కూడా జుట్టు ఊడిపోవడానికి కారణం కావచ్చు. అందుకే.. నాలుగు రకాల విటమిన్లను మనం మన డైట్ లో రెగ్యులర్ గా భాగం చేసుకుంటే హెయిర్ ఫాల్ ఉండదు.ఆ విటమిన్ల కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం..
విటమిన్ ఎ
విటమిన్ ఎ ఉన్న ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి.ఇది జుట్టు డ్రై అవ్వకుండా. తలపై చర్మం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ చాలా సహాయపడుతుంది.ఇది సెబమ్ ని ఉత్పత్తి చేస్తుంది. తల పొడిబారకుండా నిరోధిస్తుంది. అలా అని మరీ ఎక్కువగా విటమిన్ ఏ తీసుకున్నా కూడా సమస్యే. కాబట్టి.. మితంగా తీసుకోవడం మంచిది.
విటమిన్ ఎ లభించే ఆహారాలు..
క్యారెట్లు, చిలగడ దుంపలు, ఆకుకూరలు, బ్రోకలీ, గుడ్లు, పాల ఉత్పత్తులు.
విటమిన్ బి: జుట్టు పెరుగుదలను పెంచుతుంది
విటమిన్ బి కాంప్లెక్స్ జుట్టు ప్రాథమిక నిర్మాణమైన కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు కూడా సహాయపడుతుంది, ఇవి ఆక్సిజన్ , పోషకాలను జుట్టు కుదుళ్లకు తీసుకువెళతాయి. విటమిన్ బి లోపం జుట్టు రాలడాన్ని వేగవంతం చేస్తుంది.
విటమిన్ బి ఉండే ఆహారాలు..
పాలు, పెరుగు, అరటిపండ్లు, ఎండిన పండ్లు, గుడ్లు , తృణధాన్యాలు.
విటమిన్ సి: జుట్టు రాలకుండా చేస్తుంది
విటమిన్ సి అనేది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి జుట్టును రక్షిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా జుట్టు బలాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ సి లోపం ఉంటే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఈ విటమిన్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఉండదు.
విటమిన్ సి ఉండే ఆహారాలు..
కివి, నిమ్మ, నారింజ, టమోటా, ముల్లంగి , ఆకుపచ్చ కూరగాయలు.
విటమిన్ డి: జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది
విటమిన్ డి జుట్టు కుదుళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. దీని లోపం జుట్టు రాలడం,జుట్ట బలహీనపడటం, జుట్టు సాంద్రత కోల్పోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ విటమిన్ ని మనకు ఎండలో ఉండటం వల్ల లభిస్తుంది.
విటమిన్ డి ఉండే ఆహారాలు...
కొవ్వు చేపలు (సాల్మన్, ట్యూనా), గుడ్డు సొనలు, పుట్టగొడుగులు, విటమిన్ డి-ఫోర్టిఫైడ్ పాలు.
మీరు ఈ నాలుగు విటమిన్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు. అలాగే, మీరు మీ జుట్టుకు రసాయన ఉత్పత్తులను నివారించి, సహజ ఉత్పత్తులను వాడటం వల్ల కూడా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.