పెద్ద లక్ష్మీదేవి లాకెట్ ఉన్న ఈ లాంగ్ హారం పట్టుచీరలకు పర్ఫెక్ట్ మ్యాచ్. దీనికి మ్యాచింగ్ జుంకాలు పెట్టుకుంటే మీ మెడ నిండుగా, ఎంతో అందంగా కనిపిస్తుంది.
సింగిల్ లేయర్ కాకుండా డబుల్ లేయర్ ఉన్న హారం మీరు ట్రై చేయండి. ఇది వేసుకుంటే మెడకు వేరే నెక్లెస్ అవసరం లేదు. మీకు ఇది మంచి హెవీ లుక్ ఇస్తుంది.
మార్కెట్లో ఎన్ని డిజైన్లు వచ్చినా కాసుల పేరు క్రేజ్ వేరు. పాత మోడల్ కాకుండా కాస్త ట్రెండీగా ఉండే ఈ డిజైన్ చీరలపైకి చాలా బాగుంటుంది.
తక్కువ బరువులో హారం కావాలనుకునే వారు గుండ్లతో ఉన్న చైన్ డిజైన్ ఎంచుకోవచ్చు. చీర మీదకు ఇది నిండుగా కనిపించడమే కాకుండా మంచి లుక్ ఇస్తుంది.
తక్కువ బంగారంతో హెవీ లుక్ కావాలంటే ముత్యాల డిజైన్ బెస్ట్ ఆప్షన్. కింద హెవీ లాకెట్, పైన నాలుగు ముత్యాల వరుసలతో ఇది చాలా అందంగా ఉంటుంది.
పెళ్లికూతుళ్లకు ఈ హెవీ లక్ష్మీదేవి హారం అద్భుతంగా సెట్ అవుతుంది. టెంపుల్ జ్యువెలరీ కాబట్టి రిచ్ లుక్ వస్తుంది. మ్యాచింగ్ జుంకాలతో ఇది మరింత అందంగా కనిపిస్తుంది.
బంగారంతో పాటు ఏడీ స్టోన్స్ కలిసిన ఈ హారం మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. ఒరిజినల్ బంగారం కొనలేకపోతే, ఆర్టిఫిషియల్ మోడల్స్ కూడా మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి లాంగ్ హారాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. హెవీ డిజైన్లు ఇష్టపడని వారు ఈ సింపుల్ మోడల్ ఎంచుకోవచ్చు. ఫంక్షన్లకు ఇది బెస్ట్ ఛాయిస్.
కాసుల పేరు తర్వాత మామిడి పిందెల హారానికి ఫుల్ డిమాండ్ ఉంది. మోడ్రన్ టచ్ తో వచ్చిన ఈ డిజైన్ ఒక్కటి మెడలో వేసుకుంటే వేరే నగలు అవసరం లేదు.
కేవలం బంగారం మాత్రమే ఇష్టపడని వారు పచ్చలు, రూబీ, కుందన్స్ కాంబినేషన్ హారాలు ఎంచుకోవచ్చు. ఇవి మీకు ఎంతో క్లాసీ, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
ఆ మధ్య బాగా ట్రెండ్ అయిన గుట్టపూసల హారం క్రేజ్ ఇంకా తగ్గలేదు. పట్టుచీరల మీదకు ఈ హారం వేసుకోవడానికి మహిళలు ఇప్పటికీ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
బంగారం, ఏడీ స్టోన్స్ కలయికతో వచ్చిన ఈ హారం నైట్ పార్టీలకు పర్ఫెక్ట్. మెడలో వేసుకుంటే ఇది మీకు ఎంతో క్లాసీ లుక్ తో పాటు అందాన్ని ఇస్తుంది.