వర్షాకాలంలో ఈ సమస్యల బారిన పడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి?
Winter Season: వర్షాకాలం అంటేనే అనారోగ్య బారిన పడే కాలమని చెప్పాలి. వర్షాల వల్ల చలి ప్రభావం కూడా పెరగటంతో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి వాటి నుంచి ఉపశమనం పొందటానికి మార్గాలేంటో తెలుసుకుందాం?

winter season
వర్షాకాలం వచ్చే చల్లదనంతో పాటు కొన్ని సమస్యలను కూడా తీసుకువస్తుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ సీజన్లోనే ఎందుకు సమస్యలు ఎక్కువ వస్తాయి అంటే చల్లగా ఉండటం వల్ల ఎక్కువమంది వ్యాయామం చేయడానికి ఇష్టపడరు. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తగ్గుతుంది.
దాని వలన రోగనిరోధక శక్తి తగ్గి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. కొన్ని జాగ్రత్తలతో వీటన్నింటినీ అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం. వర్షాలు ఎక్కువగా ఉన్నా కూడా గోరువెచ్చని నీరు తాగటం వల్ల సమస్యలు తొలగిపోతాయి. వేడివేడి పదార్థాలను మాత్రమే తినటం వంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే గొంతు సమస్యలను కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
కొన్ని కొన్ని సార్లు చల్లగాలి వల్ల శరీరంలో కీళ్ల నొప్పులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి వాతావరణం లో సరైన వ్యాయామంతో పాటు ఎప్పుడూ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునే లాగా చూసుకోవాలి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది జలుబు, దగ్గు.ఇది మామూలు రోజుల్లోనే ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
అలాంటిది వర్షకాలం వచ్చేసరికి వాటి ప్రతాపం మరింత ఎక్కువవుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఎక్కువగా జలుబు దగ్గు వస్తుంది. రోగనిరోధక శక్తి వాతావరణం మార్పు వల్ల వస్తుంది. అందుకే ఎక్కువగా రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలని దూరం పెట్టవచ్చు.
సీజనల్ కాయగూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బయటి నుంచి వచ్చిన తరువాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. వర్షంలో తడవటం వల్ల కూడా కొన్ని ఫంగస్ ఇన్ఫెక్షన్ లు వస్తుంటాయి. కాబట్టి వర్షంలో తడవకుండా గొడుగు లాంటివి, రెయిన్ కోట్ లాంటివి అందుబాటులో ఉంచుకోవాలి.