Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Motivational story: 'నోరు మంచిదైతే.. ఊరు ఎలా మంచిది అవుతుంది'.. ఈ కథ చదివితే అర్థమవుతుంది

Motivational story: 'నోరు మంచిదైతే.. ఊరు ఎలా మంచిది అవుతుంది'.. ఈ కథ చదివితే అర్థమవుతుంది

సమాజంలో మనిషి ఎలా జీవించాలి.? మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి.? ఇలాంటి విషయాలను మన పెద్దలు చిన్న చిన్న సామెతలతో ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాంటి ఓ సామెతలో 'నోరు మంచిదైదే, ఊరు మంచిది అవుతుంది' ఒకటి. ఈ సామెతకు సరిగ్గా సరిపోయే ఓ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

Narender Vaitla | Published : Mar 05 2025, 06:25 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
12
Asianet Image

ఒక రోజు ఓ బాటసారి కొత్త గ్రామంలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో ఊరు ప్రారంభంలో ఓ స్వామిజీ కూర్చుని ఉంటాడు. అతనితో మాట్లాడుతూ.. 'ఈ ఊరిలో ఎలాంటి వారు ఉంటారు స్వామి' అని ప్రశ్నిస్తాడు. దానికి స్వామిజీ బదులిస్తూ.. 'నేను ఉండే చోట అందరూ స్వార్థపరులు, సోమరిపోతులు, కోపిష్టులు, ఇతరులకు సాయం చేయని వారు' ఉన్నారని చెప్పాడు. దీంతో ఇది విన్న స్వామిజీ.. 'ఈ గ్రామంలో కూడా అచ్చం అలాంటి వాళ్లే ఉన్నారు బాబు' అని చెప్తాడు. ఇది విన్న ఆ బాటసారి ఆ గ్రామంలో రాకుండా మరో గ్రామానికి వెళ్లిపోతాడు. 

22
Telugu story

Telugu story

దీనికి స్వామీజీ బదులిస్తూ.. ఈ గ్రామంలో కూడా అలాంటి మంచి వ్యక్తులే ఉన్నారని చెప్తాడు. ఇది విన్న ఆ బాటసారి గ్రామంలోకి వెళ్తాడు. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న ఓ శిష్యుడు స్వామిజీ వద్దకు వెళ్లి.. 'అదేంటి స్వామీ.. ఇద్దరికి వేరు వేరు సమాధానం ఇచ్చారు'? అని ప్రశ్నిస్తాడు. దీంతో అసలు విషయం చెబుతూ.. 'సమాజాన్ని మనం ఎలా చూస్తామో, మనల్ని కూడా సమాజం అలాగే చూస్తుంది. నువ్వు మంచిని కోరుకుంటే సమాజం నుంచి కూడా నీకు మంచి జరుగుతుంది. అందుకే నోరు మంచిదైదే ఊరు మంచిది అవుతుంది' అని సమాధానం ఇస్తాడు. 

నీతి: ఈ చిన్న కథలో ఎంతో గొప్ప సందేశం దాగి ఉంది. మనం సమాజాన్ని ఎలా చూస్తామన్న దానిపైనే సమాజం మనల్ని ఎలా చూస్తుందో అర్థమవుతుంది. మనచుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. కానీ మనం మంచిగా ఉంటే మనకు అంతా మంచే కనిపిస్తుంది. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories