MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Poppy Seeds:చికెన్ కర్రీలో వేసే ఈ గింజలు.. విమానంలో తీసుకెళ్తే జైల్లో వేస్తారు..!

Poppy Seeds:చికెన్ కర్రీలో వేసే ఈ గింజలు.. విమానంలో తీసుకెళ్తే జైల్లో వేస్తారు..!

Poppy Seeds: మనం రెగ్యులర్ గా వంటకు వాడే గింజలే.. కానీ, వాటిని కొన్ని దేశాల్లో కంప్లీట్ గా బ్యాన్ చేశారు. ఎంతలా అంటే.. తెలీక ఎవరైనా వాటిని విమానంలో తీసుకొని ప్రయాణిస్తే.. ఏకంగా జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఆ గింజలు ఏంటి?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 19 2026, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇవి మాత్రం తీసుకెళ్లకూడదు..
Image Credit : gemini ai

ఇవి మాత్రం తీసుకెళ్లకూడదు..

మనం రోజువారీ వాడే వంటల్లో, గ్రేవీ కూరల్లో.. ముఖ్యంగా, చికెన్ కర్రీలో రుచి పెంచడం కోసం గసగసాలను వాడుతూ ఉంటాం. కొన్ని రకాల స్వీట్లలో గసగసాలను వాడుతూ ఉంటారు. మన దేశంలో వీటిని ఎంతో స్వేచ్ఛగా వాడుతున్నాం. కానీ, కొన్ని దేశాల్లో వీటి వాడకంపై నిషేధం విధించారని మీకు తెలుసా? పొరపాటున వాటిని ఏ రకాల వంటల్లోనూ వాడరు. అంతేకాదు.. కనీసం ఇతర దేశాల నుంచి ఎవరైనా వాటిని తీసుకువచ్చినట్లు తెలిసినా చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిందే. ఇంతకీ, ఆ దేశాలు వీటిని ఎందుకు బ్యాన్ చేశాయి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గసగసాలపై నిషేధం ఉన్న దేశాలు ఇవే..
Image Credit : gemini ai

గసగసాలపై నిషేధం ఉన్న దేశాలు ఇవే..

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు గసగసాల దిగుమతి, అమ్మకం, రవాణాపై జోరూ టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

దుబాయి... ఈ దేశంలో.. గసగసాలను డ్రగ్స్ జాబితాలో చేర్చారు. యూఏఈ చట్టాల ప్రకారం గసగసాలను దేశంలోకి తీసుకురావడం, లేదా వారి దగ్గర ఉంచుకోవడం చట్టరిత్యా చాలా నేరం.

సింగపూర్: ఈ దేశంలో గసగసాల దిగుమతి, అమ్మకం పూర్తిగా నిషేధించారు.

సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలు: ఇక్కడ కూడా గసగసాలపై కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వీటిని మత్తుపదార్థాల జాబితాలో చేర్చారు.

33
గసగసాలపై నిషేధం ఎందుకు?
Image Credit : Getty

గసగసాలపై నిషేధం ఎందుకు?

ఈ దేశాలు గసగసాలను కేవలం సాధారణ వంట దినుసుగా పరిగణించవు. గసగసాలు 'పాపివర్ సోమ్నిఫెరమ్' (Papaver somniferum) మొక్క నుండి వస్తాయి. ఇదే మొక్క నుంచి నల్లమందు (Opium), మార్ఫిన్ వంటి మత్తు పదార్థాలు తయారవుతాయి. గసగసాలలో మత్తును కలిగించే ఆల్కలాయిడ్స్ చాలా తక్కువ శాతంలో ఉన్నప్పటికీ, వీటిలో ఒపియేట్ అవశేషాలు ఉండే అవకాశం ఉండటంతో వీటిని నార్కోటిక్స్ (మత్తు పదార్థాలు) కోవలోకి పరిగణిస్తారు. అనుమతి లేకుండా వీటిని దేశంలోకి ప్రవేశపెడితే అక్రమ రవాణాగా భావించి కఠిన చర్యలు తీసుకుంటారు.

విమానాల్లో తీసుకువెళ్లడం నిషేధమా?

అవును, కొన్ని దేశాలకు వెళ్లే విమానాల్లో ఇది పూర్తిగా నిషేధం. మీరు ఒకవేళ యూఏఈ (దుబాయ్), సింగపూర్ లేదా గల్ఫ్ దేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు మీ లగేజీలో గసగసాలు ఉంటే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ లేదా కస్టమ్స్ తనిఖీలలో తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఈ దేశాల విమానాశ్రయాలలో అత్యాధునిక స్క్రీనర్లు ఉంటాయి. లగేజీలో గసగసాలు లేదా వాటితో చేసిన పిండి పదార్థాలు దొరికితే వాటిని సీజ్ చేయడమే కాకుండా, ప్రయాణికులను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి, విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు మీ వంటింటి సరుకుల జాబితాలో గసగసాలు లేకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: రోజూ కప్పు పెరుగు తింటే మన శరీరంలో జరిగేది ఇదే
Recommended image2
Earrings: చీరలో మరింత అందంగా కనిపించాలంటే ఈ ఇయర్ రింగ్స్ బెస్ట్!
Recommended image3
Instant Upma: హడావిడి లేకుండా నిమిషాల్లో బ్రెడ్ ఉప్మా..దీనికి పేరు పెట్టే పనే లేదు.
Related Stories
Recommended image1
Colour: పింక్ అమ్మాయిల కలర్, బ్లూ అబ్బాయిల కలర్ గా ఎలా మారింది?ఈ నిజం తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే
Recommended image2
Facts: చెట్లకు నిజంగానే డబ్బులు కాస్తే ఏమౌతుంది? మనకు తిండి కూడా దొరకదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved