MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • గురుదేవో భవ: .. విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు ఇలా విషెస్ చెప్పండి

గురుదేవో భవ: .. విద్యాబుద్ధులు నేర్పిన గురువుకు ఇలా విషెస్ చెప్పండి

teachers day 2023: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యకు చేసిన కృషిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజే ఆయన పుట్టిన రోజు కూడా. ఈ టీచర్స్ డే సందర్భంగా ఎలా విష్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 05 2023, 08:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జ్ఞాపకార్థం ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1888లో జన్మించిన ఆయన తత్వవేత్త, పండితుడు, భారతరత్న అవార్డు గ్రహీత కూడా.

27

టీచర్స్ డే చరిత్ర, ప్రాముఖ్యత

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 లో భారతదేశ రెండో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతని విద్యార్థులు సెప్టెంబర్ 5 ను ప్రత్యేక దినంగా జరుపుకోవడానికి ఆయన అనుమతి కోరుతారు. సమాజానికి ఉపాధ్యాయులు అందించిన అమూల్యమైన సేవలను గుర్తించడానికి సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించాలని ఆయన కోరారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఒకసారి "ఉపాధ్యాయులు దేశంలో ఉత్తమ మనస్సులు కావాలి" అని అన్నారు.

37

టీచర్స్ డే విషెస్

తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ప్రసాదిస్తే.. ఆ జీవితాన్ని సంపూర్ణంగా ఎలా ఉపయోగించుకోవాలో గురువులు మనకు నేర్పుతారు. ప్రపంచంలోని కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

47

నా జీవితానికి మీరు చేసిన కృషిని వర్ణించడానికి మాటలు కరువయ్యాయి. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. దీంతో మీరు మరింత ఎక్కువ కాలం ఇలా బోధించాలని  ఆశిస్తున్నాను. హ్యాపీ టీచర్స్ డే 

57

ప్రియమైన గురువుగారు నాకు అన్ని విధాలా సహకరించినందుకు, జ్ఞానోదయం కలిగించినందుకు మీకెంతో ధన్యవాదాలు. జీవితాంతం మీ ఆశీర్వాదం ఉంటే నేను ఎప్పటిలాగే విజయం సాధిస్తాను. 

మంచి ఉపాధ్యాయులు దొరకడం చాలా చాలా కష్టం. మీరు మా గురువుగా ఉండటం మా అదృష్టం. హ్యాపీ టీచర్స్ డే

ఈ రోజు నన్ను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దడంలో మీరెంతో సహాయపడ్డారు. అందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని! హ్యాపీ టీచర్స్ డే.
 

67

1) "మంచి ఉపాధ్యాయులకు విద్యార్థులలో దాగున్న ప్రతిభనుఎలా బయటకు తీసుకురావాలో తెలుసు." - చార్లెస్ కురాల్ట్

2) "నిజంగా వివేకవంతుడైన గురువు మిమ్మల్ని తన జ్ఞాన గృహంలోకి ప్రవేశించమని అడగడు. కానీ మిమ్మల్ని మీ మనస్సు గుమ్మం వైపు నడిపిస్తాడు." – ఖలీల్ జిబ్రాన్
 

77

3) "పిల్లలను బాగా చదివించే వారు తల్లిదండ్రుల కంటే ఎక్కువ గౌరవించబడతారు. ఎందుకంటే వీరు మాత్రమే జీవితాన్ని ఇచ్చారు. వారు బాగా జీవించే కళను ఇచ్చారు." - అరిస్టాటిల్

4) "సృజనాత్మక వ్యక్తీకరణ, జ్ఞానంలో ఆనందాన్ని మేల్కొల్పడం గురువుకున్న అత్యున్నత కళ." - ఆల్బర్ట్ ఐన్స్టీన్

5) "మన గురించి మనం ఆలోచించడానికి సహాయపడే వారే నిజమైన గురువులు"- సర్వేపల్లి రాధాకృష్ణన్

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్
Recommended image2
అదిరిపోయే ఆక్సిడైజ్డ్ ముక్కుపుడక డిజైన్లు.. చూసేయండి
Recommended image3
Mother in law Psychology: కోడళ్లను వేధించే అత్తల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved