MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • టీచర్స్ డే: ఈ టీచర్స్ డే ను ఎప్పటికీ మర్చిపోకూడదంటే ఇలా సెలబ్రేట్ చేయండి

టీచర్స్ డే: ఈ టీచర్స్ డే ను ఎప్పటికీ మర్చిపోకూడదంటే ఇలా సెలబ్రేట్ చేయండి

teachers day 2023: టీచర్స్ డేను స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్స్ లో బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే సారి టీచర్స్ డేను ఎప్పటికీ మర్చిపోలేరు. 

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 04 2023, 09:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

teachers day 2023: మన దేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. విద్యాపరంగా, భావోద్వేగపరంగా, సామాజికంగా, ప్రవర్తనాపరంగా విద్యార్థులకు బోధించి మార్గనిర్దేశం చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలిపేందుకు ఈ రోజు అంకితం చేయబడింది. మన కుటుంబం తర్వాత ఉపాధ్యాయులే మన మంచి భవిష్యత్తుకు తోడ్పడుతారు. అండ దండగా ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిపిస్తారు.  గురువు లేకుంటే మనం జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. ఎందుకంటే గురువు కేవలం విద్యనే కాదు.. మంచేంది? చేడేంది? ఇతరులతో ఎలా నడుచుకోవాలి? జీవితంలో ఎలా ఎదగాలి వంటి ఎన్నో విషయాలను మనకు నేర్పిస్తాడు. మంచి గురువుంటే చాలు ఆ విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మంచి మనుషులుగా మారడానికి. చిన్నతనం నుంచే మన చేతులను పట్టుకొని, ఓపికగా నేర్పి, మనల్ని స్వతంత్రులుగా తీర్చిదిద్దుతున్నారు గురువులు. అయితే స్కూల్స్ విద్యార్థులు టీచర్స్ డే నాడు టీచర్స్ సన్మానం చేసి వారి గురించి స్పీచెస్ ఇస్తుంటారు. ఇది కామన్. అయితే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకునేవారి కోసం కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

27

టీచర్స్ డే కార్డు

మీ భావాలను వ్యక్తీకరించడానికి చాలా సింపుల్, పురాతన, సాంప్రదాయ  పద్దతి. అవును మనలోని భావాలను అందరి ముందు చెప్పడమంటే చాలా కష్టం.అందుకే వీటిని ఒక పేపర్ రాసి వారికి అందివ్వడం బెస్ట్ ఆప్షన్. మీలో చాలా మంది వీటిని టీచర్స్ ఏం చదువుతారని అనుకుంటారు. కానీ ఉపాధ్యాయులు ఇలాంటి వాటినే ఎక్కువగా ఇష్టపడతారు. వారిపట్ల మీకున్న అభిమానాన్ని తెలుసుకోవాలనుకుంటారు. అంతేకాదే వీటిని అలాగే భద్రంగా దాచుకుంటారు. విద్యార్థులే సొంతంగా కార్డు తయారు చేసి వారి గురించి రాస్తే ఉపాధ్యాయులు ఎంతో ఇష్టపడతారు తెలుసా?
 

37

టీచర్స్ డే సందర్భంగా ఫ్లాష్ బ్యాక్

ఈ టీచర్స్ డే టీచర్స్ కు, మీకు స్పెషల్ గా డేగా గుర్తిండిపోవాలంటే ఒక వీడియోను క్రియేట్ చేయండి. వారు సంతోషంగా ఉన్న క్షణాలను ఈ వీడియోలో చూపించొచ్చు. నిజానికి ఉపాధ్యాయులు విద్యార్థులతో అందమైన క్షణాలను చూడటానికి ఎంతో ఇష్టపడతారు. అలాగే ఈ యాక్టివిటీ సోలో లేదా గ్రూప్ టాస్క్ కావొచ్చు. ఇందులో ఉపాధ్యాయులందరి వీడియోలను ఉంచొచ్చు. ఇది  మీ అందమైన స్కూల్ జ్ఞాపకంగా ఉంటుంది కూడా. 

47

క్లాస్ రూం డెకరేషన్

క్లాస్ రూం అందంగా ఉండాలని ప్రతి టీచర్ కోరకుంటారు.  అందుకే  మీరు ఉంటున్న క్లాస్ రూం ను అందంగా డెకరేట్ చేస్తే మీ టీచర్ ఎంతో ఆనంద పడుతుంది. మీ టీచర్స్ తో మీరు దిగిన ఫోటోల జ్ఞాపకాలను చూపించడానికి ఫోటో కొలాజ్ ను క్రియేట్ చేయండి. ఈ క్షణాలు మీ టీచర్స్ ను ఎంతో సంతోషించేలా చేస్తాయి.
 

57

మీ టీచర్ లాగా దుస్తులు ధరించండి 

ఒక్కో టీచర్స్ ఒక్కోలా రెడీ అవుతుంటారు. కాబట్టి ఈ టీచర్స్ డే మీకు స్పెషల్ గా ఉండాలనుకుంటే  మీరు కూడా వారిలా వారిలా డ్రస్సప్ అయ్యి రండి. మీరు వారి డ్రెస్సింగ్ స్టైల్ ను గమనించి ఉంటారు. అందుకే ఈ టీచర్స్ డే రోజున మీ టీచర్ లాగా మీరు కూడా దుస్తులు ధరించి వారితో ఫోటో దిగండి. ఈ యాక్టివిటీ మిమ్మల్నే కాదు వారిని కూడా ఎంతో సంతోషపెడుతుంది. టీచర్స్ దీనిని ఎంతో ఇష్టపడతారు కూడా.

67

డ్యాన్స్ ప్రోగ్రామ్ 

డ్యాన్స్ ప్రోగ్రామ్ మీ మూడ్ ను పెంచుతుంది. అందుకే మీ ఉపాధ్యాయుల కోసం దీన్ని ప్లాన్ చేయండి. దీన్ని ఫన్నీగా, ఆహ్లాదకరంగా చేయడానికి మీ ఉపాధ్యాయులు తరగతిలో ఎక్కువగా ఉపయోగించే పదాలను ట్విస్ట్ కూడా ఇవ్వొచ్చు. 
 

77

సరదా ఆటలు

ఉపాధ్యాయులు ఆడగలిగే కొన్ని ఆటలను కూడా ఈ రోజు  మీరు నిర్వహించండి. ఆన్లైన్లో లేదా తరగతి గదిలో ఆడటానికి ఏదైనా మంచి ఆడటను సెలెక్ట్ చేయండి. మీ టీచర్స్ తో ఆడండి. ఇవి వారిని ఎంతో సంతోషపెడతాయి. ఇలాంటి మూమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
బియ్యం పప్పులు పురుగు పట్టకుండా స్టోరేజ్ టిప్స్
Recommended image2
Bread: బ్రౌన్ బ్రెడ్ కంటే వైట్ బ్రెడ్ మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారు..?
Recommended image3
Husband Psychology: భార్య మాట వినని భర్తల గురించి సైకాలజీ ఏం చెప్తోందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved