MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఎంతో రుచికరమైన ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

ఎంతో రుచికరమైన ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

ఓట్స్ (Oats) ఆరోగ్యానికి మంచిది. ఓట్స్ లో అనేక పోషక విలువలు ఉంటాయి. డైట్ ను అనుసరించే వారు బరువు పెరగకుండా ఉండాలంటే ఓట్స్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇది ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్. మనం పాలలో కలుపుకుని ఓట్స్ ను తింటాం. అలా కాకుండా వెరైటీగా ఇలా ఉప్మా చేసుకుని తింటే ఇది మీకు ఎంతగానో నచ్చుతుంది. ఈ ఆర్టికల్ ద్వారా ఇప్పుడు మనం ఎంతో సులభంగా తయారు చేసుకునే ఓట్స్ ఉప్మా (Oats upma) తయారీ విధానాన్ని గురించి తెలుసుకుందాం..    

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Nov 12 2021, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఓట్స్ (Oats), పావు టీ స్పూన్ ఆవాలు (Mustard), పావు టీ స్పూన్ జీలకర్ర (Cumin seeds), పావు టీ స్పూన్  సెనగ పప్పు (Peanuts), పావు టీ స్పూన్ మినపప్పు (Urad dal), కొంచెం అల్లం (Ginger) ముక్క, రెండు పచ్చిమిరపకాయలు (Green chilli), ఒక ఉల్లిపాయ (Onion), కరివేపాకు (Curry Leaves), ఒక టమాట (Tomato), పావు స్పూన్ పసుపు (Turmeric), సరిపడ ఉప్పు (Salt), క్యారెట్ (Carrot), బీన్స్ (Beans), కోతిమీర (Coriyander), నిమ్మరసం (Lemon juice), నూనె (Oil).
 

24

ముందుగా ఉల్లిపాయ, టమాట, పచ్చిమిరప కాయలు, క్యారెట్, బీన్స్ లను నీటిలో శుభ్రపరచుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టి పోపుకు సరిపడు నూనె (Oil) వేసి నూనె వేడెక్కాక అందులో పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర , పావు టీ స్పూన్ సెనగపప్పు, పావు టీ స్పూన్ మినపప్పు ఒకదాని తర్వాత ఒకటి వెయ్యాలి. ఈ పోపులోనే సన్నగా తరిగిన అల్లం (Ginger) ముక్కలు వేసి వేగిన తరువాత ఇందులో ఒక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
 

34

దొరగా వేగిన తరువాత ఇందులో కరివేపాకు, కట్ చేసుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలు, టమాట ముక్కలు, పావు స్పూను పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని తక్కువ మంట (Low flame) మీద వేగించాలి. ఇలా కూరగాయలన్నీ బాగా మగ్గిన తరువాత ఒక కప్పు ఓట్స్ కి ఒకటిన్నర కప్పు నీళ్లు (Water) పోసి మూత పెట్టి బాగా మరిగించాలి. ఇలా బాగా మరుగుతున్న నీటిలో ఓట్స్ ను వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
 

44

నీరంతా పీల్చేదాకా సన్నని సెగపై ఉడికించాలి. చివరిలో సన్నగా కట్ చేసుకున్న కోతిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్ లో ఓట్స్ ఉప్మా నుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేయడమే అంతే. మీరు కోరే ఎంతో రుచికరమైన ఓట్స్ ఉప్మా రెడీ (Ready). డయాబెటిక్స్ కు ఇది మంచి ఆహారం. ఇది ఒక హెల్తీ (Healthy) బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు మీ డైట్ లో ఈ ఓట్స్ ఉప్మా ను తీసుకోండి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Food: అబ్బ‌బ్బా.. వేడి వేడి పూరి, చ‌ల్ల‌టి మ్యాంగో జ్యూస్‌. రుచి చూస్తే స్వ‌ర్గ‌మే
Recommended image2
Mangalsutra Designs: వావ్ అనేలా ట్రెండీ నల్లపూసల మంగళసూత్రాలు
Recommended image3
గ‌ర్భిణీలు పారాసిట‌మాల్ వేసుకుంటే పిల్ల‌లు ఆటిజంతో పుడుతారా.? అధ్య‌య‌నంలో తేలిన నిజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved