Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?
టాలివుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 35 ఏళ్లు దాటుతున్నా తరగని అందంతో దూసుకుపోతోంది. ఇంతకీ ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో మీకు తెలుసా?

టాలివుడ్ టాప్ హీరోయిన్లలో తమన్నాభాటియా ఒకరు. తెలుగు, తమిళం, హిందీ ఇతర భాషాల్లో ఆల్ మోస్ట్ అందరు టాప్ హీరోల పక్కన తమన్నా నటించారు. ప్రస్తుతం ఆమె వయసు 35. అయినా తరగని అందంతో దూసుకుపోతున్నారు. ఇంతకీ ఆ అందం వెనక రహస్యం ఏంటో తెలుసా?
తమన్నా మాటల్లో..
తమన్నా తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎంత బిజీగా ఉన్నా ఉదయం యోగా, స్విమ్మింగ్ లాంటివి చేస్తారట. నానబెట్టిన బాదంపప్పులతో తన డేలీ డైట్ ప్రారంభిస్తారట. అంతేకాదు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటారట. మంచి ఫుడ్, నీళ్లు ఎక్కువగా తాగడం, సరైన వ్యాయామాలు తన చర్మ సౌందర్య రహస్యమని తమన్నా చెప్పుకొచ్చారు.
అంతేకాదు మరికొన్ని విషయాలను తమన్నా ఫ్యాన్సుతో పంచుకున్నారు. 'నేను నా శరీరాన్ని ఇష్టపడతాను, ప్రేమిస్తాను. రోజంతా పని చేసిన తర్వాత, స్నానం చేసేటప్పుడు నా బాడీలోని ప్రతి భాగాన్ని తాకి థాంక్స్ చెప్పుకుంటాను. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ ఎందుకు అలా చేయకూడదు? ప్రతిరోజూ నా శరీరం ఎంతో కష్టపడుతుందని నాకు తెలుసు. నాకు మంచిగా సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటాను' దాంట్లో తప్పేముందని తమన్నా అన్నారు.
సన్నగా ఉండటం...
సన్నగా ఉండటం అంటే ఫిట్‌గా ఉండటం అని నమ్మేదాన్నని తమన్నా అన్నారు. 'సన్నగా ఉంటే నేను అందంగా కనిపిస్తానని అనుకున్నాను. కానీ అది నాకు మంచిది కాదని తర్వాత తెలుసుకున్నాను. అప్పుడే నేను సన్నగా ఉండటం కంటే శరీర సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాను' అని నటి తమన్నా చెప్పుకొచ్చారు.
వాటికి సంబంధం లేదు
'సౌందర్యానికి, సన్నగా ఉండటానికి సంబంధం లేదు. దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది' అని తమన్నా మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
బాలీవుడ్ లో బిజీగా
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత చాలా బిజీగా మారారు. పెద్ద ప్రాజెక్టులతో పాటు ప్రకటనల్లో కనిపిస్తూ భారీ రెమ్యూనరేషన్ పొందుతున్నారు.
విజయ్ వర్మతో..
ప్రస్తుతం బాలివుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నారు. తమన్నా, విజయ్ వర్మ ట్రిప్పుల్లో, బాలీవుడ్ ఈవెంట్లలో కలిసి కనిపిస్తుంటారు. త్వరలోనే వీరు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.