MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • జాగ్రత్త.. పొడవుగా ఉండేవాళ్లకే 100 కంటే ఎక్కువ రోగాలొస్తయంట..

జాగ్రత్త.. పొడవుగా ఉండేవాళ్లకే 100 కంటే ఎక్కువ రోగాలొస్తయంట..

మీ శరీర ఎత్తు, ఆరోగ్య ప్రమాదాల మధ్య సంబంధం ఉంటుందని కొత్త అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా 5.9 అడుగుల పురుషులు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 Min read
Mahesh Rajamoni
Published : Jun 24 2022, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి ఒక్కరూ మంచి ఎత్తులో ఉండాలని కోరుకుంటారు. ఇక కొందరు పొట్టిగా ఉన్నవాళ్లు హైట్ పెరగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పొడవు Genetics, హార్మోన్లు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. కానీ మంచి ఎత్తు ఉన్న వ్యక్తి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎత్తు ఎక్కువగా ఉన్న వాళ్లకు 100కు పైగా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 

26

పొడవుగా ఉన్నవారిలో హృదయ స్పందన రేటు (Heart rate), నరాలు దెబ్బతినడం (Nerve damage), కడుపులో పుండ్లు (Stomach ulcers), వెరికోస్ వెయిన్స్ (Varicose veins)సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.

36

2.5 లక్షల మంది పురుషులు, స్త్రీలపై పరిశోధన జరిగింది

PLOS జెనెటిక్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో.. అనేక సాధారణ పరిస్థితులతో సంబంధం ఉన్న కారకంగా ఎత్తు గురించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎత్తు, అనేక వ్యాధుల మధ్య సాధ్యమయ్యే సంబంధాన్ని పరిశీలించారు పరిశోధకులు. ఈ పరిశోధనలో 2.5 లక్షల మంది పురుషులు, మహిళలు పాల్గొన్నారు. ఈ పరిశోధనల ప్రకారం.. 5.9 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఆడ, మగవారిలో వ్యాధుల ప్రమాదం కనుగొనబడింది. ఈ వ్యక్తులకు రక్తం గడ్డకట్టడం (Blood clots), ఫంగల్ ఇన్ఫెక్షన్లు (Fungal infections), చర్మం (Skin), ఎముక (Bone) ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
 

 

46
high blood pressure

high blood pressure

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు

ఎక్కువ బరువును ఎత్తడం వల్ల ఎముకలు, కండరాలు, పాదాలపై ఒత్తిడి పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని కారణంగా పొడవాటి వ్యక్తులు అధిక రక్తపోటు (High blood pressure), అధిక కొలెస్ట్రాల్ (High cholesterol), కరోనరీ హార్ట్ డిసీజ్ (Coronary heart disease)వంటి అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది.
 

56

పొడవాటి ఎత్తు ఉన్న స్త్రీలు ఆస్తమా బారిన పడొచ్చు

5.3 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న మహిళలకు ఆస్తమా (Asthma), నాన్-స్పెసిఫిక్ నాడీ డిజార్డర్స్ (Non-specific neurological disorders) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. కానీ పురుషులకు కాదు. రిస్క్, వ్యాధి నిఘాను అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తి ఎత్తును పరిగణనలోకి తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.

66
healthy eating habits

healthy eating habits

జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి

పొడవు ఎత్తు ఉన్నవారిలో దాదాపు 100-110 రకాల వ్యాధులను గుర్తించినట్లు అధ్యయన రచయిత డాక్టర్ శ్రీధరన్ రాఘవన్ తెలిపారు. యువతలో అనేక వ్యాధులకు వారి ఎత్తు కారణం కావచ్చని ఈ పరిశోధనలో నిర్ధారించబడింది.

అదృష్టవశాత్తూ మనం నియంత్రించగలిగే అనేక ప్రమాద కారకాలు ఉన్నాయని.. అవి తీవ్రమైన ఆరోగ్య పరిణామాల ప్రమాదాన్ని తగ్గించగలవని ఆయన తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తక్కువ మొత్తంలో తరచుగా నీళ్లను తాగడం, ధూమపానం మానేయడం వంటివి పాటించాలి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved