Sweat in Sleep: నిద్రలో చెమట ఇన్ని రోగాలకు సంకేతమా..?
Sweat in Sleep: ఏసీ లేదా ఫ్యాన్ కింద పడుకున్నా గానీ నిద్రలో మీకు ఎక్కువగా చెమట పడుతోందా? డౌటే లేదు మీకు ఈరోగాలు సోకి ఉండొచ్చు. ఒక సారి డాక్టర్ ను చూపించుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మండుతున్న ఎండలకు.. ఊపిరాడని ఉక్కపోతలకు చెమట పట్టడం సర్వసాధారణ విషయం. ఇక రాత్రుళ్లు ఫ్యాన్, ఏసీలు లేకుండా నిద్రపోవడం కష్టమే. నిమిషం పాటు ఫ్యాన్ ఆఫ్ చేసినా.. చెమటతో ఒళ్లంతా తడిసిపోతుంది. అయితే మీరు కూల్ గా ఉండే ప్లేస్ లో నిద్రపోయినా చెమటలు పడుతున్నాయా? అయితే దీన్ని అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఇది ఎన్నో రోగాలకు సంకేతం కావొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోవిడ్.. ఒమిక్రాన్ బారిన పడితే కూడా నిద్రలో చెమటలు పడతాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే మీకు ఒకవేళ నిద్రలో చెమటలు పడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మర్చిపోకూడదు. అలాగే టైట్ గా ఉండే బట్టలను వేసుకోకూడదు. రూమ్ కిటికీలు తెరిచి పడుకోవడం బెటర్.
షుగర్ లెవెల్స్ తగ్గితే.. షుగర్ లెవెల్స్ తగ్గడం, పెరగడం అనే సమస్య ఎక్కువగా డయాబెటీస్ పేషెంట్లలో కనిపిస్తుంది. అయితే మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గితే కూడా చెమటలు బాగా పడతాయట. దీన్ని వైధ్య పరిభాషలో Hypoglycemia అంటారు. మధుమేహుల బాడీలో ఇన్సులిన్ తిగ్గితే ఇలా అవుతుంది.
ఆందోళన (Anxiety)..Tension, Anxiety వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా విపరీతమైన చెమట పడుతుంది. ముఖ్యంగా ఆందోళన సమస్య ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీంతో బాడీ కూల్ గా అయ్యేందుకు చెమట రిలీజ్ అవుతుంది.
ఆల్కహాల్.. రాత్రిపూట ఆల్కహాల్ తాగే వారికి కూడా చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే వాయు మార్గాలపై ఆల్కహాల్ ప్రభావం పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దీంతో గాలి పీల్చుకోవడానికి బాడీ అవసరానికి మించి కష్టపడుతుంది. దీంతో బాడీ టెంపరేచర్ పెరిగి.. గుండె కొట్టుకుని వేగం కూడా పెరుగుతుంది. ఈ కారణంగా వీరిలో చెమట పడుతుంది.
క్యాన్సర్.. క్యాన్సర్ లక్షణాలలో చెమట కూడా ఒకటి. మీకు క్యాన్సర్ సోకిందనడానికి సంకేతంగా నిద్రలో చెమట పడుతుందట. ఈ చెమట లింఫోమా అనే క్యాన్సర్ కు సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మెడిసిన్స్ వల్ల.. కొన్ని రకాల జబ్బులకు వాడే మెడిసిన్స్ వల్ల కూడా నిద్రలో చెమటపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, యాంటీ డిప్రెసెంట్స్ వంటి మెడిసిన్స్ బాడీ టెంపరేచర్ ను పెంచేస్తాయి. దీంతో ఒంటిపై విపరీతంగా చెమటలు పడతాయి. ఈ సమస్యలకు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. లేదంటే మీరు ప్రమాదంలో పడొచ్చు.