చలికాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ ను తప్పక పెట్టండి
చలికాలంతో పిల్లలు తరుచుగా అనారోగ్యం బారిన పడుతుంటారు. కారణం వారిలో రోగ నిరోధక శక్తి తగ్గడమే. అందుకే ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాలను పిల్లలకు రోజూ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

ఇతర కాలాలతో పోల్చితే చలికాలంలోనే పిల్లల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి. అందుకే ఇలాంటి సమయంలో పిల్లల ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బలంగా ఉండాలి. లేదంటే ఫ్లూ సంక్రమించే అవకాశం ఉంది. చలికాలంలో ఫ్లూ ఎక్కువ రోజులు ఉంటుంది. అంతేకాదు ఇతర సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వీటి నుంచి పిల్లలు క్షేమంగా ఉండాలంటే పోషకాలు ఎక్కువగా ఉండే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను రోజూ తినిపించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
curd
పెరుగు
చాలా మంది పెరుగును చలికాలంలో అస్సలు తినరు. ఎందుకంటే దీనివల్ల జలుబు చేస్తుందని. నిజమేంటంటే.. చలికాలంలో రోజూ ఒక కప్పు పెరుగును తింటే ఎలాంటి సమస్యలు రావు. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. వీటినే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అంటారు. ఇది మీ గట్ ను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగులో కాల్షియం, విటమిన్ డి, పొటాషియంతో పాటుగా ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. రోజూ కప్పు తెల్లని పెరుగును పిల్లలకు తినిపిస్తే.. వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ఈ పెరుగులో ఎలాంటి ప్రిజర్వేటివ్ లు, చక్కెరలు కలపకూడదు.
nuts
గింజలు
శీతాకాలంలో గింజలను తినడం వల్ల శరీరంలో వెచ్చగా ఉంటుంది. జీడిపప్పులు, వేరుశెనగలు, వాల్ నట్స్, పిస్తా వంటి నట్స్ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపతాయి. వీటిని తినడం వల్ల పిల్లల జీవక్రియలు సక్రమంగా ఉంటాయి. వీటిని ఇతర ఆహారాల్లో కలిపి కూడా ఇవ్వొచ్చు.
విత్తనాలు
విత్తనాల్లో ఫైబర్, మోనోశాచురేటెడ్ కొవ్వులు, పాలీ అన్శాచురేటెడ్, ఇతర ముఖ్యమైన ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజలు, నువ్వులు, చియా విత్తనాలు, అవిసెగింజల్లో ఈ పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ ఇ పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిండానికి కూడా సహాయపడతాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
గుడ్లు
గుడ్లు పెద్దలకే కావు.. పిల్లలకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్లు, బ్రోకలీతో వేయించిన కూరగాయల గుడ్లు, క్యారెట్లు, బ్రెడ్ ఆమ్లెట్ వంటివి పిల్లలకు చేసి పెడితే.. ఇష్టంగా తింటారు. గుడ్డు కూరలు, బిర్యానీలో కూడా గుడ్లను తినొచ్చు.
సిట్రస్ పండ్లు
రోగ నిరోధక శక్తిని పెంచడంలో సిట్రస్ పండ్లు ముందుంటాయి. ఎందుకంటే ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ద్రాక్ష పండ్లు, తీపి నిమ్మకాయ, నారింజ, టాన్జేరిన్లు, నిమ్మకాయల్లో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ సూక్ష్మపోషకం చాలా ముఖ్యమైంది. వీటిలో విటమిన్ బి, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియంతో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఆకు కూరలు
ఆకు కూరలను సాధారణంగా క్రూసిఫరస్ కూరగాయలు అని కూడా అంటారుు. బ్రోకలీ, బచ్చలికూర, కాలీ ఫ్లవర్, కాలే, క్యాబేజీ కూరగాయలు మీ పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం, ఇనుుము, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.