MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Summer Vacation: మండే ఎండల్లో చల్లగా గడపాలా? మీ మనసు దోచే ప్లేసులు ఇవే

Summer Vacation: మండే ఎండల్లో చల్లగా గడపాలా? మీ మనసు దోచే ప్లేసులు ఇవే

 Summer Vacation: సమ్మర్ లో వెకేషన్ కి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ ఎండలకు కేరళ బెస్ట్ ఆప్షన్. మరి, కేరళలలో ఎలాంటి ప్లేస్ లు మిస్ అవ్వగుండా చూడాలో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 20 2026, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Kerala Trip
Image Credit : Freepik

Kerala Trip

బయట ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు పిల్లలకు పరీక్షలు అయిపోయి సెలవులు ఇచ్చేశారు. ఇంట్లో పిల్లల అల్లరి భరించలేక బయటకు ఎక్కడికైనా తీసుకువెళ్దాం అంటే.. ఎండలు భయంకరంగా ఉన్నాయి.. ఇలాంటి సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా? అయితే.. ఈ ఎండలకు మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే.. కేరళ బెస్ట్ ఆప్షన్. చాలా మంది చలికాలం, వర్షాకాలంలో మాత్రమే కేరళ అందాలు చూడటానికి బాగుంటాయి అని అనుకుంటారు. కానీ.. ఎండాకాలంలో కేరళను బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ సీజన్ లో కేరళలలో ఏ హిల్ స్టేషన్స్ కి వెళితే.. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కేరళలలో చూడాల్సిన బెస్ట్ హిల్ స్టేషన్స్..
Image Credit : @KeralaTourism/X

కేరళలలో చూడాల్సిన బెస్ట్ హిల్ స్టేషన్స్..

1.మున్నార్ ( Munnar)

మున్నార్ కేరళలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడ వేసవిలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఈ ప్లేస్ చూడటానికి రెండు కళ్లు సరిపోవా అన్నంత అందంగా ఉంటుంది.

ముఖ్య ఆకర్షణలు: టీ మ్యూజియం, ఎరవికుళం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్.

ప్రత్యేకత: ఇక్కడి విస్తారమైన టీ తోటలు కళ్లకు పచ్చని విందును అందిస్తాయి.

2. వయనాడ్ (Wayanad) - ప్రకృతి ప్రేమికుల నిలయం

వయనాడ్ పశ్చిమ కనుమల మధ్య ఉన్న ఒక అందమైన ప్రాంతం. ఇది కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపడానికి పర్ఫెక్ట్ ప్లేస్.

ముఖ్య ఆకర్షణలు: ఎడక్కల్ గుహలు, బాణాసుర సాగర్ డ్యామ్, సూచిప్పార జలపాతాలు.

ప్రత్యేకత: ఇక్కడి దట్టమైన అడవులు, మసాలా తోటల గుండా ప్రయాణం మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.

34
3. తెక్కడి (Thekkady) - వన్యప్రాణుల ప్రపంచం
Image Credit : Asianet News

3. తెక్కడి (Thekkady) - వన్యప్రాణుల ప్రపంచం

వైల్డ్ లైఫ్ , అడ్వెంచర్ ఇష్టపడే వారికి తెక్కడి ఒక అద్భుతమైన ఛాయిస్.

ముఖ్య ఆకర్షణలు: పెరియార్ నేషనల్ పార్క్, పెరియార్ సరస్సులో బోట్ రైడ్.

ప్రత్యేకత: బోటులో ప్రయాణిస్తూ నీళ్లు తాగడానికి వచ్చే ఏనుగుల మందలను, ఇతర వన్యప్రాణులను దగ్గరగా చూడవచ్చు.

4. వాగమన్ (Vagamon) - అడ్వెంచర్ అండ్ పీస్

తక్కువ రద్దీ, ఎక్కువ ప్రశాంతత కోరుకునే వారికి వాగమన్ సరైన చోటు. ఇటీవల కాలంలో ఇది పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది.

ముఖ్య ఆకర్షణలు: పైన్ అడవులు (Pine Forests), మొట్టెల్ కుండ్రం (మేడోస్), పారాగ్లైడింగ్.

ప్రత్యేకత: ఇక్కడి పచ్చని మైదానాలు చూస్తుంటే స్కాట్లాండ్ దేశంలో ఉన్నామా అన్నట్లు అనిపిస్తుంది.

44
5. పొన్ముడి (Ponmudi) - మేఘాల అంచున
Image Credit : gemini

5. పొన్ముడి (Ponmudi) - మేఘాల అంచున

తిరువనంతపురంకు దగ్గరగా ఉండే ఈ హిల్ స్టేషన్ చిన్న ట్రిప్ ప్లాన్ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది.

ముఖ్య ఆకర్షణలు: గోల్డెన్ వ్యూ పాయింట్, మీన్ముట్టి జలపాతాలు.

ప్రత్యేకత: ఇక్కడికి వెళ్లే దారిలో ఉండే 22 హెయిర్‌పిన్ బెండ్‌లు డ్రైవింగ్ ఇష్టపడే వారికి గొప్ప థ్రిల్‌ను ఇస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Laos Travel: మీరు ఎంత పేదవాళ్లు అయినా... ఇక్కడికి వెళితే కోటీశ్వరులు అవుతారు
Recommended image2
Visa Free Travel: పాస్ పోర్టు ఉంటే చాలు వీసా లేకుండా మనం ఇప్పుడు 56 దేశాలు తిరగేయచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved