Heat Stroke: మండుతున్న ఎండలకు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఇలా చేయండి..
Heat Stroke: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే.. వడదెబ్బ లేదా సన్ స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉంది. మరి దీని బారిన పడకూడదంటే మాత్రం కొన్ని సంరక్షణ చర్యలను తప్పక తీసుకోవాల్సిందే.

ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఎండలకు బయటకు వెళితే వడదెబ్బ లేదా స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరి నీళ్లు.. మండే వేడి కారణంగా మన శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతుంటాయి. ఇవి ఉంటేనే బాడీ హైడ్రేటెడ్ గా, ఆరోగ్యంగా ఉంటాం. మరి ఇవి తిరిగి పొందాలంటే మాత్రం కొబ్బరి నీళ్లను తప్పని సరిగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటుగా చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది.
ఉల్లిపాయ.. వేడిని నివారించడానికి ఉల్లిపాయ ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం ఉల్లిపాయను పేస్ట్ లా తయారుచేసుకుని నుదిటిపై రుద్దాలి. ఉల్లిపాయ రసాన్ని ఛాతి, ముఖం, చెవుల చుట్టూ అప్లై చేయొచ్చు. ఉల్లిపాయ రసం శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని పలు పరిశోధనలు కూడా స్పస్టం చేశాయి.
నీరు తాగుతూ ఉండాలి.. వేసవిలో బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. బాడీ డీహైడ్రేట్ అయితే ఒక్కో సారి ప్రాణాలు కూడా పోవచ్చు. ఈ సమస్యలేమీ రాకూడదంటే..నీళ్లను బాగా తాగాలి. నీళ్లను బాగా తాగడం వల్ల సూర్యరశ్మి, వేడి గాలుల చెడు ప్రభావం తగ్గుతుంది.
మామిడి రసం.. వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ వేసవిలో వడదెబ్బ తగలకూడదన్నా.. సూర్య రశ్మి ప్రభావం మీ మీద పడకూడదన్నా.. మామిడి గుజ్జును తప్పక తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకోసం మామిడిని పెద్దపెద్ద ముక్కకలుగా కోసి నీటిలో వేసి సన్నని మంటపై ఉడకబెట్టాలి. ఆ తర్వాత దాని గుజ్జును మిక్సరై గ్రైండ్ లో వేసి.. అందులో కాస్త ఉప్పు అల్లం వేసి చూర్ణం చేయండి. అది తాగితే ఎండలో బయటకు వెళ్లినా మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు.
మజ్జిగ.. పెరుగు, ఉప్పుతో తయారుచేసిన మజ్జిగ ఈ వేసవిలో టానిక్ లా పనిచేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అలాగే వడదెబ్బ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.