summer health tips : సమ్మర్ లో పెరుగు తింటే ఏమౌతుందో తెలుసా..?
summer health tips : పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా తయారుచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది. బరువు తగ్గించడంలోపెరుగు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. చలువ కూడా చేస్తుంది.

summer health tips : వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో పెరుగు ఒకటి. ఈ సీజన్ లో పెరుగును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.
మార్చి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండల దాటికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా ఒంటికి చలువ చేసే ఆహారాలను మాత్రమే తినడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే బాడీ టెంపరేచర్ ను తగ్గించేందుకు పెరుగు ఎంతో సహాయపడుతుంది. కానీ ఈ వేసవిలో పెరుగును తినాలా? వద్దా? అని సంకోచించేవారు కూడా ఉన్నారు.
రెగ్యులర్ గా పెరుగును తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గడమే కాదు.. డీహైడ్రేషన్ బారిన పడకుండా కూడా చేస్తుంది. ఈ సీజన్ లో పెరుగును తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి..
పెరుగులో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా తయారుచేస్తుంది. కాబట్టి ఎముకల సమస్యలతో బాధపడేవారు ఈ సీజన్ లో రెగ్యులర్ గా పెరుగును తినండి.
మన శరీరంలో ఉండే టాక్సిన్స్, వివిధ రసాయనాలు మన ఇమ్యూనిటీ పవర్ ను తగ్గిస్తాయి. దీంతో మనబాడీలో ఉండే కణాలు క్షీణించడం మొదలవుతుంది. దీంతో చిన్నవయసు వారి సైతం.. పెద్దవారిలాగే కనిపిస్తారు. ఇలాంటి వారు పెరుగును ఎక్కువగా తినాలి. దీనివల్ల మీరు అందంగా కనిపిస్తారు.
రోగనిరోధక శక్తి పెరగాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా పెరుగును రెగ్యులర్ గా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగులో మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచే పోషకాలు ఉన్నాయి. అందుకే పెరుగును క్రమం తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో లాక్టిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది. ఇది మన శరీరానికి హానిచేసే బ్యాక్టీరియాను అంతంచేసే బ్యాక్టీరియోసిన్ ను రిలీజ్ చేస్తుంది. దీంతో మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా ఉండదు.
పెరుగులో ఉండే ఈ లాక్టిక్ యాసిడ్ మంచి బ్యాక్టీరియాను సంఖ్యను పెంచుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి దీన్నితినడం మాతరం మానేయకూడదని నిపుణులు సలహానిస్తున్నారు.
పెరుగు వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు అధిక బరువును తగ్గించడానికి తోడ్పడుతాయి.
ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఒంట్లో నీటి నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ వల్ల ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సమయంలో పెరుగును తినడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశమే ఉండదు. కాబట్టి ఈ సీజన్ లో పెరుగును ఎక్కువగా తినండి.