- Home
- Life
- weight loss: తొందరగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ సీజనల్ పండ్లను తినండి మార్పు వెంటనే కనిపిస్తుంది..
weight loss: తొందరగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ సీజనల్ పండ్లను తినండి మార్పు వెంటనే కనిపిస్తుంది..
weight loss: పుచ్చకాయ, దోసకాయ, నారింజ పండ్లు, అత్తిపండ్లు, మాస్క్ మెలన్ పండ్లను ఈ వేసవిలో తరచుగా తింటే వేసవి తాపం తీరడమే కాదు సులభంగా బరువు కూడా తగ్గొచ్చు. అదెలా అంటే..

weight loss: ప్రస్తుత కాలంలో అధిక బరువు సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే ముసలివాళ్లు సైతం ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల లేని పోని రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమస్య నుంచి వీలైనంత తొందరగా బయటపడాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే ఈ వేసవిలో కొన్ని రకాల పండ్లు మనల్ని ఆరోగ్యంగా, హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటుగా బరువును కూడా తగ్గిస్తాయి. వాటిని ఈ సీజన్ లో తింటే మీరు బరువు ఇట్టే తగ్గిపోతారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
పుచ్చకాయ.. వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఈ పండులో నీరు 92 శాతం ఉంటుంది. ఈ సీజన్ లో పుచ్చకాయను తినడం వల్ల వేసవి తాపం తీరుతుంది. అంతేకాదు మీరు డీహైడ్రేషన్ బారిన పడతారనే భయం కూడా ఉండదు. ఈ పండును తింటే చలువ కూడా చేస్తుంది. ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగానే ఉంటుంది. దీంతో మీరు ఎక్కువగా ఫుడ్ ను తీసుకోలేరు. అంతేకాదు ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
కీరదోసకాయ.. ఆకుపచ్చ పండ్లు సహజ శీతలీకరణ గుణాలను కలిగి ఉంటాయి. ఈ పండు వేసవిలో మనకు దివ్య ఔషదంగా పనిచేస్తుంది. ఈ పండును సలాడ్ లేదా స్మూతీ రూపంలో తీసుకోవచ్చు. ఇకపోతే ఈ పండును ఈ వేసవికాలం తినడం వల్ల అధిక వేడి సమస్య నుంచి మీరు రక్షింపబడతారు. ఈ కాయలో నీరు 95 శాతం ఉంటుంది. చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఈ కాయను తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అంతేకాదు దీన్ని తరచుగా తింటే ఆరోగ్యంతో పాటుగా అందం కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నారింజ పండ్లు.. ఈ సిట్రస్ ఫ్రూట్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ పండు వేసవితాపాన్ని తీర్చడమే కాదు.. అధిక బరువును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం కండరాల తిమ్మిరి సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది.
మాస్క్ మెలన్.. మాస్క్ మెలన్, హనీడ్యూ, కాంటాలౌప్ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ పండ్లలో పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. ఈ పండ్లలో పైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉండి.. కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఈ పండు బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, కాపర్, జింక్ ఇతర మినరల్స్ కూడా మెండుగా ఉంటాయి. . ఈ పుచ్చకాయ పండును తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గడమే కాదు కంటిచూపు కూడా మెరుగుపడుతుంది.
అత్తిపండు.. ఈ పండులో 89 శాతం నీరు మరియు ఫైబర్ ఉంటుంది. అంతేకాదు ఈ పండులో కేలరీలు కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఉంటాయి. ఈ పండును చిరుతిండిలా కూడా ఉపయోగించుకోవచ్చు. భోజనాల మధ్యలో తినడం వల్ల మీరు ఇతర ఆహారాలను తినకుండా చేస్తుంది. అలాగే మీ కడుపును కూడా నిండుగా ఉంచుతుంది. ఈపండులో ఉంటే విటమిన్ ఎ, సి, జింక్, ఐరన్ వంటి ఇతర పోషకాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.