MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • weight lose: ఈ సమ్మర్ ఫుడ్స్ తో ఈజీగా బరువు తగ్గొచ్చు..

weight lose: ఈ సమ్మర్ ఫుడ్స్ తో ఈజీగా బరువు తగ్గొచ్చు..

weight lose: బరువు తగ్గడానికి ఈ వేసవి కాలమే సరైన సమయం. ఈ ఎండాకాలంలో మన ఆరోగ్యాన్ని హైడ్రేటెడ్ గా ఉంచే కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఈజీగా వెయిట్ తగ్గొచ్చు.. అవేంటంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 29 2022, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

weight lose: ప్రపంచ వ్యాప్తంగా అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అధిక బరువు సమస్యతో ఎంతో మంది ఊబకాయం బారిన పడి.. ప్రమాదకరమైన జబ్బులతో చిన్న వయసులోనే చనిపోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బరువు విపరీతంగా పెరిగిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు.  ముందే ఇది వేసవి కాలం.. వేసవి దాహాన్ని తీర్చుకోవడానికి రకరకాల పానీయాలను, ఐస్ క్రీములను తీసుకుంటూ ఉంటారు. వీటి వల్ల హెల్త్ పాడవడమే కాదు.. బరువు కూడా పెరుగుతారు. 

38

కానీ ఈ వేసవికాలం మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచే కొన్ని హెల్తీ ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యం బాగుండటమే కాదు సులభంగా బరువు కూడా తగ్గొచ్చు. అవేంటో ఈఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

48

పుచ్చకాయ.. పుచ్చకాయలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండును తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండటమే కాదు.. జీర్ణక్రియ వేగాన్ని కూడా పెంచుతుంది. దీంతో కేలరీలు  ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో మీరు చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. కాబట్టి ప్రతిరోజూ పుచ్చకాయను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోండి. 
 

58

బెర్రీలు.. వెయిట్ ను తగ్గించేందుకు బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు ఎంతగానో సహాయపడతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల అధిక బరువును ఈజీగా తగ్గొచ్చు. కాబట్టి వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. వీటిని తినడం వల్ల ఒంట్లో కొవ్వు పేరుకునే అవకాశం ఉండదు. 

68

ద్రాక్షపండు.. ద్రాక్షపండులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ మన శరీరంలోకి వెళ్లి నీటితో కలిసి జెల్ వంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగానే ఉన్న అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు అదనంగా ఇతర ఆహార పదార్థాలను తినలేరు. మధుమేహులకు కూడా ఈ పండు ఎంతో సహాయపడుతుంది. ఈ వేసవిలో ఈ పండును ఎక్కువగా తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండటమే కాదు.. బరువు కూడా తగ్గుతారు. 

78

సొరకాయ.. సొరకాయ ఈ కాలంలో ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వీటిని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది కూడా. వీటిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తినడం వల్ల కడుపు తేలికగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచుగా తినండి. 

88

దోసకాయ.. ఈ వేసవి కాలానికి కీరదోసకాయ మనకు దివ్య ఔషదంలా పనికొస్తుంది. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తరచుగా తినడం వల్ల మన బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్ గానే ఉంటుంది. ఈ కీరదోస కాయను తినడం వల్ల జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు బరువు కూడా చాలా తొందరగా తగ్గుతారు. ఈ కాలం వేడి చేయకూడదంటే కీరదోసకాయలను అలాగే తిన్నా లేదా.. సలాడ్ లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Salt: ఉప్పు వంట కోసమే కాదు.. ఇంట్లో ఉన్న సమస్యలను కూడా పోగొడుతుందట
Recommended image2
Curry Leaves: రోజూ ఈ ఒక్క ఆకు తిన్నా చాలు.. ఎన్ని లాభాలో?
Recommended image3
Healthy Diet After 30: వయసు 30 దాటిందా? ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉండటమే మంచిది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved