MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • summer food: మండుతున్న ఎండలకు శరీరం చల్లగా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాల్సిందే..!

summer food: మండుతున్న ఎండలకు శరీరం చల్లగా ఉండాలంటే వీటిని తప్పక తీసుకోవాల్సిందే..!

summer foods: మండుతున్న ఎండలకు, వేడి గాలులకు ఒంట్లో వేడి పెరిగిపోతుంటుంది. దీంతో తొందరగా అలసిపోతారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు మిమ్మల్నిచల్లగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 03 2022, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

summer foods: ప్రస్తుతం ఎండలు దంచి  కొడుతున్నాయి. ఈ ఎండల కారణంగా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి కూడా జంకుతున్నారు. అయితే ఈ వేడి గాలులు, విపరీత ఎండవల్ల జనాలు తరచుగా అలసటకు గురవుతుంటారు.  వీటివల్ల శరీరంలో వేడి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరాన్నిచల్లగా ఉండేలా చేస్తాయి. అవేంటంటే.. 

26

పుచ్చకాయ.. ఈ ఎండాకాలంలో పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండులో నీరు 90 శాతం ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్, పొటాషియం, లైకోపీన్ వంటివి ఈ పండులో అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడుతాయి. అంతేకాదు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అలాగే మనల్నిడీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. 
 

36

టొమాటో.. టొమాటో వంటలకు రుచిని తీసుకురావడమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. టొమాటోలల్లో ఉండే పొటాషియం హైబీపీని కంట్రోల్ చేస్తుంది. టొమాటోలల్లో ఉండే విటమిన్ బి, విటమిన్ ఇ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

46

పెరుగు.. వేసవిలో పెరుగు మన ఆరోగ్యానికి దివ్య ఔషదంతో సమానం. ఎందుకంటే ఈ సీజన్ లో దీన్ని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. కాస్త పెరుగు తీసుకుని అందులో కొంచెం షుగర్, కొంచెం ఉప్పును వేసి తీసుకుంటే మీ ఒంట్లో వేడి ఇట్టే తొలగిపోతుంది. అంతేకాదు ఇది మీకు తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. 

56

దోసకాయ.. వేసవిలో మనకు అత్యవసరమైన ఆహారాల్లో దోసకాయ ఒకటి. దీనిలో నీరు 90 శాతం ఉంటుంది. ఇది ట్యాక్సిన్స్ బయటకు పోయేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు ఇది మనల్ని డీహైడ్రేషన్ సమస్య బారిన పడకుండా కాపాడుతుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీనిలో ఉండే ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును కంట్రోల్ చేయడానికి ఎంతో సహాయపడతాయి. 

66

కొబ్బరి నీళ్లు.. వేసవిలో తప్పక తీసుకోవాల్సిన పానీయాల్లో కొబ్బరి నీళ్లు ఒకటి. ఈ కొబ్బరి నీళ్లలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Floral Hairstyles: ఈ ఫ్లోరల్ హెయిర్ స్టైల్స్ చూస్తే మతిపోతుంది
Recommended image2
Couple Bracelets: క్యూట్ కపుల్ మ్యాచింగ్ బ్రేస్‌లెట్ డిజైన్లు
Recommended image3
Gold Earrings: అరగ్రాము బంగారంతో చిన్నారికి అదిరిపోయే చెవిపోగులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved