- Home
- Life
- లో బీపీ సమస్యతో బాధపడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే.. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తయ్ జాగ్రత్త
లో బీపీ సమస్యతో బాధపడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే.. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తయ్ జాగ్రత్త
Low Blood Pressure: కొందరికి హైబీపి సమస్య ఉంటే.. మరికొంతమందికి మాత్రం లోబీపీ సమస్య ఉంటుంది. ఇలాంటి వారు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది.

మారుతున్న జీవన శైలి కారణంగా ఎన్నో రోగాలు సర్వ సాధారణం అయిపోయాయి. అందులో హైబీపీ, లో బీపీ సమస్యలు ఒకటి. అయితే చాలా మంది అధిక రక్తపోటు (High blood pressure) సమస్యనే సీరియస్ గా తీసుకుంటారు. నిజానికి హైబీపీ ఎంత డేంజరో.. లో బీపి కూడా అంతే ప్రమాదకరం.
అయితే హైబీపి పేషెంట్ల మాదిరిగా బీపీ తక్కువ ఉన్నవాళ్లు మెడిసిన్స్ ను వాడాల్సిన అవసరం లేదు. కొన్ని హెల్త్ టిప్స్ ను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అలా అని పూర్తిగా నిర్లక్ష్యం చేసినా.. ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
లో బీపిని ఉన్నవాళ్లకు ఈ సమస్యలు వస్తాయి: లో బీపీ సమస్య ఉంటే.. శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలగడం, గందరగోళమైన ఆలోచనలు, నిరాశతో ఉండటం, ఎప్పుడూ తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే గాయం చిన్నదైనా.. రక్తం ఎక్కువగా కారుతుంది. అంతేకాదు వీళ్లు వెదర్ ఛేంజ్ అయినా అనారోగ్యం బారిన పడతారు. అలాగే కళ్లు తిరిగి పడిపోతుంటారు. అంతేకాదు వీళ్లకు గుండెకు సంబంధించిన వ్యాధులు, గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు చుట్టుకునే ప్రమాదం ఉంది.
లో బీపి పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ సమస్య ఉన్న వారు నీళ్లను ఎక్కువగా తాగాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బీపి తక్కువుందని ఉప్పును ఎక్కువగా తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఉప్పు ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది.
బీపి తక్కువగా ఉండే వారికి.. ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ బి12 వంటి ఆహారాలు మంచి మేలు చేస్తాయి. వీళ్లకు కొబ్బరి నీళ్లు కూడా ఎంతో సహాయపడతాయి. అలాగే వీళ్లు ఎక్కువ మొత్తంలో తినకుండా.. తరచుగా కొద్ది కొద్దిగా తినాలి. దీనివల్ల బీపీ తగ్గే అవకాశం ఉండదు.
నిద్రలేమి సమస్య ఉన్నా.. నిద్ర తక్కువ పోయినా.. బీపీ తగ్గుతుందట. అందుకే నిద్రతక్కువ కాకుండా చూసుకోవాలి. హైబీపి పేషెంట్లకే కాదు.. లో బీపీ పేషెంట్లకు కూడా పండ్ల రసాలు ఎంతో మేలు చేస్తాయి. ఇందుకోసం వీరు తరచుగా.. బీట్ రూట్, దానిమ్మ పండ్ల రసాలను తీసుకోవాలి.
టొమాటోలు, క్యాబెజీ, పాప్ కార్న్, చికెన్, చీజ్, గుడ్లు, కీరదోస, ముల్లంగి, ఎర్ర క్యాప్సికం, పొద్దు తిరుగుడు గింజలు, క్యారెట్లు, బ్రోకలి, ముల్లంగి వంటివి ఎక్కువగా తినాలి. ఇవి బీపీని పెంచడానికి సహాయపడతాయి.
ముఖ్యంగా బీపీ తగ్గినప్పుడు సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే దాని నుంచి త్వరగా బయటపడతారు. అలా అని సోడియాన్ని ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే.