40 ఏండ్లు దాటాయా? అయితే రోజుకో గుడ్డు ఖచ్చితంగా తినాల్సిందేనట..
నలభై ఏండ్లు దాటిన వాళ్లు కోడిగుడ్లను తినడానికి వెనకాడుతుంటారు. కారణం.. గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువ మొత్తంలో ఉంటుందని. కానీ పలు అధ్యయనాలు 40 ఏండ్లు దాటిన వారు రోజుకు కనీసం ఒక్క గుడ్డన్నా తినాలని సూచిస్తున్నాయి. ఎందుకో తెలుసా?

సంపూర్ణ ఆహారంలో లీస్ట్ లో గుడ్డు కూడా ఉందన్న ముచ్చట మనం మర్చిపోకూడదు. ఒక్క గుడ్డుతోనే మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు లభిస్తాయని మీకు తెలుసా.. అందుకే డాక్టర్లు రోజుకు కనీసం ఒక్క గుడ్డన్నా తినాలని చెబుతుంటారు. ఇకపోతే నలభై ఏండ్లు దాటిన వారు ఖచ్చితంగా రోజుకో గుడ్డును తినాల్సిందేనంటూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది 40 ఏండ్లు దాటిన వారు గుడ్డును తినడమే మానేస్తున్నారు. కారణం గుడ్డులో కొలెస్ట్రాల్ (Cholesterol)స్థాయిలు ఎక్కువ మొత్తంలో ఉంటాయని.
మనం ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. కాబట్టి గుడ్డుపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా 40 దాటిన వారు బేషుగ్గా వీటిని తినేయొచ్చు. ఉడకబెట్టిన గుడ్డును తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అందుకే 40 దాటినా.. ఏలాంటి భయాలు, అపోహలు పెట్టుకోకుండా రోజుకో గుడ్డును తినండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు వారానికి ఖచ్చితంగా ఏడు గుడ్లకు తగ్గకుండా తినాలని చెబుతున్నారు.
ఉడకబెట్టిన గుడ్డులో విటమిన్ ఎ, బి5, బి12 పుష్కలంగా ఉంటాయి. అలాగే అమైనో ఆమ్లాలు, సెలీనియం, పాస్పరస్ మెండుగా లభిస్తాయి. అలాగే ప్రోటీన్లు 6.3, కొవ్వు 5.3, కార్బొహైడ్రేట్లు 0.6, కొలెస్ట్రాల్ 212 మైక్రోగ్రాములు, కేలరీలు 77 ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి ఎంతగానో అవసరం. మన బాడీ సక్రమంగా పనిచేసేందుకు ఇవి ఎంతో అవసరం.
40 ఏండ్లు దాటిన వారు ఎందుకు తినాలంటే: ఈ వయస్సు దాటిన వారిలో Muscles బలహీనంగా మారుతుంటాయి. ఈ కండరాలు తిరిగి బలంగా మారేందుకు గుడ్డు ఎంతగానో సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ వయస్సు దాటిన వారికి గుడ్డు ఎన్నో పోషకాలను, ప్రోటీన్లను, కావాల్సినంత శక్తిని అందిస్తుంది. అంతేకాదు గుడ్లు తొందరగా జీర్ణమవుతాయి. గుడ్డులో ఉండే leucine అనే amino acid కండారాలను బలంగా చేస్తుంది.
కొలెస్ట్రాల్ ఉంటుందని గుడ్డును తినడం మానేయకండి. ఎందుకంటే గుడ్లల్లో Cholesterol తక్కువ మొత్తంలోనే ఉంటుంది. అంతేకాదు ఇది Good cholesterol కూడా. ఇది శరీరానికి మేలు చేసేదే. అంతేకాదు ఇది మన బాడీకి ఎంతో అవసరం. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయని, బరువు పెరుగుతామని భయాలేమీ పెట్టుకోకుండా రోజుకో ఉడకబెట్టిన గుడ్డును తినండి. ఎందుకంటే 40 ఏళ్ల పై బడిన వారికి పోషకాహారం ఎంతో అవసరం.