MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • జలుబు, ఫ్లూతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఆహారాలను తినండి..

జలుబు, ఫ్లూతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఆహారాలను తినండి..

వానాకాలంలో ఫ్లూ, జలుబు సమస్యలు సర్వ సాధారణం. అయితే కొన్ని రకాల ఆహారాలు ఈ సమస్యల నుంచి తొందరగా ఉపశమనం కలిగిస్తాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 25 2022, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రుతుపవనాల రాకతో మండుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించింది. ఇది సంతోషకరమైన విషయమే కానీ.. కానీ ఈ సీజన్ లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జలుబు, ఫ్లూ, జ్వరం, దగ్గు వంటి సమస్యల బారిన చాలా మంది పడుతుంటారు. ఎందుకంటే సీజన్ల మార్పు శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అందుకే మారిన వాతావరణానికి తగ్గట్టు తగు ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అయితే ఈ సీజన్ లో కామన్ గా వచ్చే జలుబు, ప్లూ  సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే వీటి నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

36
Soup

Soup

సూప్ (Soup)

ఫ్లూతో బాధపడేవారు సూప్ ను తాగితే మంచిది. వేడి వేడిగా.. రుచిగా ఉండే సూప్ ను తాగితే వచ్చే ఆనందమే వేరు. ఇది ఫ్లూ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఎన్నో విటమిన్, ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.  ఇది సులువుగా కూడా జీర్ణం అవుతుంది. 

46

వెల్లుల్లి (garlic)

వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  దీనిలో ఎన్నో ఔషద గుణాటుంటాయి. ఇది వేసిన వంటలు చాలా టేస్టీగా అవుతాయి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది ఫ్లూ, జలుబు సమస్యలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

56

కొబ్బరి నీళ్లు (coconut water)

ఫ్లూ లేదా జలుబు సమస్యలతో బాధపడేవారికి నీళ్లు అసలే తాగాలనిపించదు. ఇలాంటి సమయంలో వీరు కొబ్బరి నీళ్లను తాగితే మంచిది. ఈ నీళ్లు మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. శరీరానికి నీటి అవసరాన్ని తీర్చడానికి సహాయపడుతాయి. ఎలక్ట్రోలైట్ ను భర్తీ చేయాలంటే కొబ్బరినీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఈ వాటర్ మిమ్మల్ని శక్తివంతంగా కూడా ఉంచుతాయి. 
 

66

వీటితో పాటాగు పండ్లు, గుడ్లు, పాలు, చెకెన్, తాజా కూరగాయలు, భారతీయ మసాలా దినుసులను తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకున్నా జలుబు నుంచి తొందరగా బయటపడతాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Godavari Temple Tour : కేవలం రూ.5670 కే 4 రోజుల వీకెండ్ టూర్.. హైదరాబాద్ నుండి ఈ ఆంధ్రా ఆలయాలు, అందాలను చుట్టిరండి
Recommended image2
Gold Lockets: చిన్న పిల్లల కోసం అదిరిపోయే గోల్డ్ లాకెట్స్.. చూసేయండి
Recommended image3
Baby Earrings: 1 గ్రాములో బేబీ ఇయర్ రింగ్స్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved