MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gold: బంగారం కొనడానికి బెస్ట్ హైబ్రిడ్ ఐడియా ఇది, తక్కువ ధరకే నగలు, బెస్ట్ పెట్టుబడి కూడా..!

Gold: బంగారం కొనడానికి బెస్ట్ హైబ్రిడ్ ఐడియా ఇది, తక్కువ ధరకే నగలు, బెస్ట్ పెట్టుబడి కూడా..!

Gold: బంగారం రేటు తగ్గింది కదా అని నగలు కొనుగోలు చేస్తున్నారా? మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ కి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది కదా… అలాంటివి లేకుండా.. బంగారం కొనాలి అనుకుంటున్నారా? అయితే.. నిపుణులు చెప్పిన ఈ హైబ్రిడ్ ఫార్ములా ఫాలో అవ్వాల్సిందే…

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 02 2026, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
GOLD
Image Credit : Getty

GOLD

ఇండియన్స్ కీ బంగారానికి విడదీయరాని సంబంధం ఉందని చెప్పొచ్చు. ఇంట్లో ఏదైనా శుభకార్యం, పండగలు, పెళ్లిళ్లు.. ఏది ఉన్నా.. బంగారం కొనాలని అనుకుంటారు. ఇక.. ఏదైనా ఫంక్షన్ కి వెళితే.. భారీగా నగలు ధరించి అందరికంటే అందంగా కనిపించాలనే కోరిక స్త్రీలకు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. బంగారం ధరతో సంబంధం లేకుండా నగలు కొనేవారు కొందరు అయితే.. పెరుగుతున్న రేటుకు బంగారం కొనలేకపోతున్నాం అని ఫీలయ్యేవారు చాలా మంది ఉన్నారు.

అంతేకాదు, బంగారం ధర కి తోడు నగలు కొనుగోలు చేసినప్పుడు.. తరుగు, మజూరీ, మేకింగ్ ఛార్జీలు అంటూ మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు మీరు రూ. పది లక్షలకు ఖర్చు చేసి నగలు కొంటే, అందులో దాదాపు రూ.2లక్షలు కేవలం తరుగు, మజూరీ కింద పోతాయి. అంటే. మీరు షాపు నుండి బయటకు అడుగు పెట్టగానే మీ 10 లక్షల విలువ రూ.8 లక్షలకు పడిపోతుంది. అలా జరగకుండా ఉండేందుకు ఒక చిన్న హైబ్రిడ్ ఐడియా ఫాలో అయితే సరిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హైబ్రిడ్ ఐడియా..
Image Credit : Gemini

హైబ్రిడ్ ఐడియా..

బంగారం కొనేటప్పుడు నష్టపోకుండా ఉండేందుకు ఒక అద్భుతమైన హైబ్రిడ్ ఐడియా ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఏమిటా హైబ్రిడ్ ఐడియా అంటే.. మనం నగలు కొనాలి.. కానీ, అవి మన జేబుకు చిల్లు పెట్టకూడదు. దీని కోసం జస్ట్ రెండు రూల్స్ ఫాలో అవ్వాలి.

1.అలంకరణ కోసం...

వెండి ఆభరణాలు ప్రస్తుతం మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. గోల్డ్ పాలిష్ తో మార్కెట్లోకి సిల్వర్ జ్యూవెలరీ పేరుతో.. కోరుకున్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు వేల రూపాయలు ఖర్చు చేసి భారీ నెక్లెస్ లు, హారాలు, వడ్డాణాలు చేయించుకోవచ్చు. బంగారు నగలు కొనాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అదే.. సిల్వర్ అయితే మనకు వేల రూపాయల్లోనే వచ్చేస్తాయి. అంతేకాదు.. వాటికి 22 క్యారెట్ల గోల్డ్ పాలిష్ చేయిస్తే.. అవి అసలు బంగారు నగలా లేక వెండివా కనిపెట్టడం ఎవరి వల్లా కాదు.

ఈ సిల్వర్ జ్యూవెలరీ కొనుగోలు చేయడం వల్ల వీటి తయారీ ఖర్చు చాలా తక్కువ.వీటిని మార్చినా మనకు 70 శాతం రిటర్స్ వచ్చే అవకాశం ఉంది.

33
పెట్టుబడి కోసం...
Image Credit : ChatGPT

పెట్టుబడి కోసం...

తరుగు, మేకింగ్ ఛార్జీలు లేకుండా, ఎలాంటి నష్టం లేకుండా.. మీరు ఏ డబ్బుతో అయితే బంగారం కొనాలి అనుకున్నారో.. వాటితో నగలు కాకుండా.. గోల్డ్ కాయిన్స్, లేదా బిస్కెట్లు కొనుగోలు చేయాలి. వీటికి తరుగు, మజూరీ ఉండవు. భవిష్యత్తులో బంగారం ధర పెరిగినప్పుడు.. మీకు పైసా కూడా నష్టం లేకుండా పూర్తి లాభం వస్తుంది.

ఈ హైబ్రిడ్ ఐడియా ఫాలో అవ్వడం వల్ల..అసలు బంగారం పెట్టుబడి రూపంలో చాలా భద్రంగా ఉంటుంది. ఇక..అలంకరణకు సిల్వర్ జ్యూవెలరీ ఉండనే ఉంది. ఈ ఫార్ములాను రూజువారి ధరించే నగల విషయంలో కాకుండా.. ఎప్పుడైనా అరుదుగా ఫంక్షన్లకు ధరించే భారీ హారాలు, వడ్డాణం లాంటి వాటి విషయంలో వాడొచ్చు. ఎందుకంటే.. ఇలాంటివి మనం చాలా అరుదుగా ధరిస్తాం. మహా అంటే... సంవత్సరంలో నాలుగైదు రోజులు మాత్రమే..దాని కోసం.. లక్షలాది రూపాయల తరుగు చెల్లించడం కంటే.. అలంకారానికి వెండిని, పెట్టుబడి కి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేయడం తెలివైన ఆలోచన.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బంగారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Bangles: డైలీవేర్ కోసం బంగారు గాజుల డిజైన్లు ఇవే!
Recommended image2
Gold Haaram: చీరలపైకి అదిరిపోయే లాంగ్ గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి
Recommended image3
Microwave Safety: ఈ పదార్థాలు మైక్రోవేవ్ ఓవెన్‌లో అస్సలు పెట్టకూడదు
Related Stories
Recommended image1
Gold vs Platinum: బంగారం కాదు... తగ్గుతున్న ప్లాటినం ధరలు, పెరుగుతున్న ప్లాటినం నగల డిమాండ్
Recommended image2
Gold Price: ధర తగ్గిందని బంగారం కొంటున్నారా? ఇంకొక్కరోజు ఆగండి, మరింత తగ్గనున్న ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved