MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • సెలబ్రిటీల్లా మీ గడ్డం పెద్దగా కనిపించాలా? అయితే ఇలా చేయండి

సెలబ్రిటీల్లా మీ గడ్డం పెద్దగా కనిపించాలా? అయితే ఇలా చేయండి

ఈ రోజుల్లో చాలా మంది పెద్ద గడ్డాన్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు సైతం ఈ లుక్ లోనే కనిపిస్తున్నారు. ఇలా కనిపించాలని సాధారణ జనాలకు కూడా ఉంటుంది. మరి ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 07 2024, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో పొడవైన గడ్డాన్ని పెంచడం ట్రెండీగా మారింది. ముఖ్యంగా యువకులు దీన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కానీ ప్రతి ఒక్కరి గడ్డం ఒకేలా పెరగదు.

అంటే కొంతమంది అబ్బాయిలకు గడ్డం చిన్నగా ఉంటే.. కొంతమందికి మాత్రం పెద్దగా పెరుగుతుంటుంది. గడ్డం సరిగ్గా లేనివారు పెరిగేందుకు మార్కెట్ లోకి వచ్చిన రకరకాల ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయినా ఫలితం ఉండదు. 

అయితే మీరు కూడా సెలబ్రిటీల మాదిరిగా హెవీ గడ్డం లుక్ లో కనిపించాలంటే మాత్రం కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. ఇందుకోసం మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 
 

25

ఇవి మీ డైట్ లో చేర్చుకోండి

గడ్డం బాగా పెరగాలంటే మీ రోజువారి ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం క్యారెట్లు, గుడ్లు,  బచ్చలికూర, జున్ను, చేపలు, కాయధాన్యాలు, ఆకుకూరలను తినండి.

అలాగే ఒమేగా 3 ఆమ్లాలు కూడా  గడ్డం జుట్టు మూలాలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి ఇందుకోసం సాల్మన్, ట్యూనా ఫిష్ వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి. 
 

35


హైడ్రేట్ 

తల వెంట్రుకలు రాకుండా ఉండటానికి, గడ్డం బాగా పెరిగేందుకు మీరు హైడ్రేట్ గా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం మీరు పుష్కలంగా నీళ్లను తాగాలి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి.

 నిజానికి విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం మీరు ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను మీ డైట్ లో చేర్చుకోండి. 
 

45

పోషణ కోసం మసాజ్

గడ్డం బాగా పెరగడానికి మసాజ్ ఖచ్చితంగా చేయాలి. ఈ మసాజ్ రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే వెంట్రుకలకు మంచి పోషణను అందిస్తుంది. వెంట్రుకలు బాగా పెరగడానికి సహాయపడతాయి.

కాబట్టి కొబ్బరి నూనె, జోజోబా ఆయిల్ లేదా ఆముదం వంటి సహజ నూనెలను అప్లై చేసి చేతులతో గడ్డాన్ని మసాజ్ చేయండి. అలాగే గడ్డం తేమగా ఉండాలంటే గడ్డానికి ఫ్రెష్ కలబంద జెల్ ను అప్లై చేయండి.
 

55

గడ్డానికి ఆవిరి

ఆవిరితో కూడా మీ గడ్డం బాగా పెరుగుతుంది. దీని కోసం నీళ్లలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి అది మరిగే వరకు వేడి చేయండి.

ఆ తర్వాత దాని నుంచి వెలువడే ఆవిరితో గడ్డాన్ని ఆవిరి పట్టండి. ఇలా చేయడం వల్ల రంధ్రాలు తెరుచుకుని రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల గడ్డం బాగా పెరుగుతుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cleaning Hacks: వాటర్ బాటిల్‍ని ఈజీగా క్లీన్ చేేసే అద్భుతమైన చిట్కాలు!
Recommended image2
Gold Ear Chain: 3 గ్రాముల బంగారంలో ముచ్చటైన మాటీలు.. చూసేయండి
Recommended image3
Tomato: ఈ సింపుల్ ట్రిక్స్ తో టమాట మొక్కలను కుండీల్లో ఈజీగా పెంచవచ్చు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved