చెమట వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవికాలం వచ్చిందే లేదో.. ఇప్పటికే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో జనాలు ఉక్కపోతతో పాటుగా, అధిక చెమట సమస్యలతో తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలంలోనే చెమట ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా.. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటుగా ఈ కాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల చెమట వస్తుంది.

sweat
వేసవికాలం రాకతో విపరీతమైన ఉక్కపోతలతో జనాలు తెగ ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఈ కాలంలో అధిక చెమట సమస్య కూడా జనాలను ఎక్కువగా బాధిస్తుంటుంది. ఇతర కాలాలతో పోల్చితే ఎండాకాలంలోనే చెమట ఎక్కువగా పడుతుంటుంది. ఉక్కపోతలైతే కాసేపు చల్లటి గాలిలో ఉంటే పోతుంది కానీ.. ఈ చెమట సమస్య అలా కాదు. కొద్దిగా వేడిగా ఉన్నా విపరీతమైన చెమట పడుతుంది. కొంతమందికైతే చల్లగా ఉండే చోటవున్నా చెమట పడుతుంటుంది. దీనికి తోడు విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది. ఈ దుర్వాసన కారణంగా నలుగురిలోకి వెళ్లాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ చెమట దుర్వాస చిరాకు కూడా తెప్పిస్తుంది. మరి ఈ చెమట, దుర్వాస నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం పదండి..

ఎక్కువ మందికి ఆండర్ ఆమ్స్ లోనే విపరీతమైన చెమట పడుతుంది. ఆ ప్లేస్ ను టీట్రీ ఆయిల్ తో తుడుచుకుంటే చెమట, దుర్వాస సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించేందుకు యాంటీ సెప్టిక్స్ ఉపయోగించాలి.
sweat
నిమ్మతొక్కతో స్నానం చేస్తే కూడా చెమట దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు. ఇకపోతే స్నానం చేసిన తర్వాత అండర్ ఆమ్స్ లో టాల్కమ్ పౌడర్ ను వేసుకోవాలి. వీటి వల్ల బాడీ రీఫ్రెష్ గా కనిపిస్తుంది. అలాగే చెమట, దుర్వాసన సమస్య చాలా వరకు తగ్గుతుంది.
వీటితో పాటుగా ఈ కాలంలో నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. తాజా పండ్లను కూడా తింటూ ఉండాలి. ఇలా చేస్తే కూడా దుర్వాసన సమస్య చాలా వరకు తగ్గుతుంది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఎండాకాలం వేపుళ్లను చాలా తక్కువగా తినాలి. వీలైతే ఈ సీజన్ మొత్తం వాటికి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ ఫ్రైడ్ ఫుడ్స్ తింటే కూడా చెమట, దుర్వాస సమస్య వస్తుంది.
sweating
మన శరీరంలో దాదాపుగా 4 మిలియన్ల స్వేద గ్రంథులు ఉంటాయి. మన స్కిన్ కింద డెర్మిన్ అనే పొరలోపలే చెమట గ్రంథులు ఉంటాయి అయితే ఈ కాలంలో వేడి గాలులు చాలా వస్తుంటాయి. వీటికారణంగా మన శరీర ఉష్ణోగ్రత ఉండాల్సిన దానికంటే విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో మన బాడీని చల్లబరిచేందుకే చెమట విపరీతంగా పడుతుంది.
ఈ చెమట వల్ల మన ఆరోగ్యానికి మేలే జరుగుతుందే కానీ ఎలాంటి కీడూ జరగదు. ఒకరకంగా చెప్పాలంటే ..మన శరీరం ఓవర్ హీట్ అయినప్పుడు .. దాంతో స్కిన్ పొడిబారకుండా ఉండేందుకే ఇలా చెమట పడుతుంది . కానీ చెమటతో పాటుగా వచ్చే దుర్వాసనే కాస్త ఇబ్బంది పెడుతుంది.
sweat
ఈ చెమటలో నీరు, క్లోరైడ్స్, ఆమ్ల లవణాలే ఉంటాయి. అయితే ఈ చెమట ఎండిపోయిన తర్వాత మన ఒంటిపై ఉండే బ్యాక్టీరియాతో చెమటలోని ఆమ్లాలు చేరడంతో బ్యాడ్ స్మెల్ వస్తుంది.
చెమటతో పాటుగా దుర్వాస మరింత పెరగడానికి ఉప్పు, మసాలాలు కూడా కారణమవుతాయి. అందుకే వీటిని వీలైనంత తగ్గించాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ హీట్ పెరుగుతుంది. దీంతో చెమట పట్టి దుర్వాసన కూడా వస్తుంది.
sweat
నాన్ వెజ్, వెల్లుల్లి తింటే కూడా ఒంట్లో వేడి పెరిగి చెమట దుర్వాసన వస్తుంది. కాబట్టి వీటిని తినడం తగ్గించండి. వీటితో పాటుగా పరిశుభ్రత కూడా ఎంతో అవసరం. రోజుకు రెండు మూడు సార్లన్నా తలస్నానం చేయండి. సాయంత్రం వేళల్లో స్క్రబర్ తో ఒంటిని బాగా రుద్దండి. దీంతో చర్మరంద్రాలు క్లీన్ అవుతాయి. దీంతో దుర్వాసన, చెమట తగ్గుతాయి.