MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Sleep Disorders : ఈ అలవాట్లేనా రాత్రుళ్లు నిద్రలేకుండా చేసేవి..

Sleep Disorders : ఈ అలవాట్లేనా రాత్రుళ్లు నిద్రలేకుండా చేసేవి..

Sleep Disorders : ప్రస్తుత కాలంలో చాలా మంది రాత్రుళ్లు నిద్రపట్టక, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఈ అలవాట్లేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 17 2022, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రాత్రిపూట కంటినిండా నిద్రపోతేనే మీరు యాక్టీవ్ గా, ఎనర్జిటిక్ గా ఉండగలుగుతారు. నిద్రతోనే ఆరోగ్యం. ఎనర్జీ. కానీ ఈ రోజుల్లో చాలా మందికి కంటికి నిద్ర దూరమైంది. నిద్రలేమి సమస్యతో సతమతవుతున్నారు. పనిలో ఒత్తిడి, అతి ఆలోచన వంటివి వివిధ కారణాల వల్ల అర్థరాత్రి వేళ అకస్మాత్తుగా మేల్కొంటున్నారు. అప్పటి నుంచి నిద్రపోవడం లేదు. కానీ రాత్రుళ్లు సరిగా పడుకోకపోతే ఏ పనీ చేయలేరు. 

28

నిద్రలేమి అంటువ్యాధిగా మారుతోందని 2019 నివేదిక తెలిపింది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. నిజానికి నిద్రభంగానికి రాత్రితో సంబంధం లేదు. దీనికి అసలు కారణం మీ దిననచర్యేనంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ అలవాట్ల వల్లే రాత్రుళ్లు నిద్రపట్టదని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

38

పగటిపూట నిద్రపోవడం.. చాలా మంది రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఉదయం పడుకోని సాయంత్రం లేస్తారు. ఇలా పడుకోవడం వల్ల లాభాలా కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాత్రుళ్లు నిద్రసరిపోలేదని పగటి పూట పడుకుంటే ప్రతిరోజూ మీకు అలాగే అలవాటవుతుంది. దీంతో మీరు తలకిందులుగా తపస్సు చేసినా రాత్రిళ్లి నిద్రపోలేరు. ఇలా అలవాటైన వారికి పగటిపూట నిద్రపోకుండా తలనొప్పి కూడా వస్తుంది. ఒకవేళ పగటిపూట పడుకోవాల్సి వస్తే కేవలం 15 నుంచి 20 మాత్రమే నిద్రపోండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత చిన్న కునుకు తీసినా రాత్రుళ్లు నిద్రపోవడానికి తిప్పలు తప్పవట. కాబట్టి ఒకవేళ పడుకున్నా మధ్యాహ్నం మూడు గంటలకంటే ముందే ఒక పదిహేను నిమిషాలు పడుకోండి. 

48

వారాంతపు షెడ్యూల్.. చాలా మంది పనిచేసే వారు వీక్ ఆఫ్ వచ్చిందంటే చాలు వారం రోజుల నిద్రను ఆ ఒక్కరోజులోనే భర్తీ చేయాలని చూస్తారు. ఆ రోజంతా పడుకునే ఉంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచి పద్దతి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అది మీ సిర్కాడియన్ లయను ప్రభావితం చేస్తుంది.

58

నిద్రపై సూర్యకాంతి ప్రభావం.. స్కిరాడియన్ రిథమ్ అంటే .. ఇది మీరు ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోకూడదు అనే దాని గురించి మన శరీరానికి ఒక సందేశాన్ని పంపుతుంది. సూర్యరశ్మి సిర్కాడియన్ లయను ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం 20-30 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండాలి. రాత్రి పడుకునే రెండు గంటల ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల నుంచి వచ్చే నీలిరంగు కాంతికి దూరంగా ఉండాలి. ఇది మీకు హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

68

రాత్రి పడుకునే ముందు తినడం:  కొన్ని ఆహారాలు తినడం వల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు.  అందువల్ల కొన్ని ఆహారాలను రాత్రిపూట పడుకునే ముందు అస్సలు తినకూడదు. ఇందులో చాక్లెట్స్, కెఫిన్ ముందుంటాయి. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలు, ఎక్కువ సంతృప్త కొవ్వులు,  స్వీట్లు తినడం వల్ల నిద్రలేమికి దారితీస్తుందని ఒక అధ్యయనం కనుగొంది.

78

నిద్ర రహస్యాలు:  2020 లో మనం పడుకునే బెడ్ పై ఒక అధ్యయనం నిర్వహించబడింది. ఉదయం పడకలను శుభ్రం చేసుకున్న 500 మంది, శుభ్రం చేసుకోని 500 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఉదయం పూట ఎవరైతే మంచాన్ని శుభ్రంగా ఉంచుకున్నారె ఆ వ్యక్తులే నైట్ టైం తొందరగా నిద్రపోతారట. వీరు మిగిలిన వారి కంటే 20 నిమిషాలు ఎక్కువగా నిద్రపోతారట.

88

వేడినీటి స్నానం:  వేడినీటితో స్నానం చేసి పడుకుంటే తొందరగా నిద్రపోతారని చాలా మంది నమ్ముుతుంటారు. నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం అంటున్నారు నిపుణులు. వేడినీరు మన శరీరంపై ప్రభావం చూపుతుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుందని  తేల్చి చెబుతున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Amla Benefits: రోజూ ఉసిరికాయలు తింటే ఏమవుతుంది?
Recommended image2
Manthena Hair Care Tip: ఈ సీక్రెట్‍తో వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది
Recommended image3
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved