Beauty Tips: అబ్బాయిలూ.. ఈ టిప్స్ ఫాలో అవుతే అమ్మాయిలు ఫిదా అయిపోతారంతే?
Beauty Tips: అందం అనేసరికి అమ్మాయిలు మాత్రమే గుర్తొస్తారు. ఎందుకంటే వాళ్లే ఎక్కువగా అందం మీద దృష్టి పెడతారు అయితే అబ్బాయిలకి అందం అక్కర్లేదా.. అమ్మాయిలు మా వెనుక పడాలి అనుకునే అబ్బాయిల కోసమే ఈ చిట్కాలు.

సాధారణంగా అమ్మాయిల శరీరంతో పోలిస్తే అబ్బాయిల శరీరం కాస్త రఫ్ గా ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని, కాస్త శ్రద్ధ పెడితే అబ్బాయిలు కూడా ఎంతో హ్యాండ్సమ్ గా, అమ్మాయిలు ఫిదా అయిపోయే లాగా కనిపిస్తారు. అందుకోసం మీరు ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. ముఖం మీద ముందుగా కనిపించేది గడ్డం మాత్రమే. కాబట్టి ముందుగా ఆ గడ్డాన్ని నీట్ గా షేవ్ చేసుకోవటమో లేదంటే ట్రిమ్ చేసుకోవడమో చేయండి.
ఆ తర్వాత హెయిర్ కటింగ్ మీద దృష్టి పెట్టండి. ఏ షేపులో అయితే మీ హెయిర్ కట్ బాగుంటుందో ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని ఆ హెయిర్ కట్ ని ఫాలో అవ్వండి. అలాగే చర్మాన్ని రోజు మాయిశ్చరైజ్ చేస్తే ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది దీని వలన చర్మానికి పోషణ కూడా లభిస్తుంది.
అలాగే చర్మాన్ని అప్పుడప్పుడు ఎక్స్పోలియేట్ కూడా చేస్తే చర్మం మీద మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయటం వలన చర్మంపై డెడ్ సెల్స్ తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి.
అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. దీనివలన నిత్యం యవ్వనంగా కనబడుతూ ఉంటారు. అలాగే వేపాకు పొడిలో గంధం పొడి, బాదం పొడి వేసి మెత్తని పేస్టు తయారుచేసి ఫేస్ ప్యాక్ వేసుకోండి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి.
దీనివలన చర్మంపై ముడతలు ఏర్పడకుండా చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. ఆడవాళ్ళ ఫేస్ క్రీమ్లు, ఆడవాళ్ళ ఫేస్ ప్యాక్ లో ఎట్టి పరిస్థితుల్లోనే ఉపయోగించకండి ఎందుకంటే వారి శరీరతత్వం వేరు మీ శరీరకత్వం వేరు. అశ్రద్ధ చేయకుండా ఈ టిప్స్ ఫాలో అయితే అమ్మాయిలు మీ వెనుక పడటం ఖాయం.