Glowing Skin Male: ఇలా చేస్తే అబ్బాయిలు మరింత హ్యాండ్సమ్ గా మారిపోతారు..
Tips for Glowing Skin Male: అమ్మాయిలే అందంగా మెరిసిపోవాలని రూలేమీ లేదు కదా.. అందం అబ్బాయిల సొంతం కూడా. కాబట్టి అబ్బాయిలు హ్యాండ్సమ్ గా కనిపించడానికి ప్రయత్నించడంలో ఎలాంటి తప్పులేదు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Tips for Glowing Skin Male: అమ్మాయిలైతే.. పార్లర్ కు వెళ్లో లేకపోతే.. ఇంట్లోనే రకరకాల ప్రయోగాలు చేసో..అందంగా కనిపిస్తుంటారు. కానీ అబ్బాయిలకు పార్లర్లకు వెళ్లేంత టైం అయితే ఉండదు. మరికొంత మంది అబ్బాయిలైతే.. ఎలా ఉంటే ఏంటి అంటూ ముఖం గురించి కేరింగ్ యే తీసుకోరు. దాంతో వారి ఫేస్ అందవిహీనంగా తయారవుతుంది. ఆ వాడిపోయిన మొహం తోనే పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు వెలుతుంటారు. ఇతరులతో పోల్చితే వీరి ఫేస్ చాలా డల్ గా ఉటుంది.
కేవలం స్నానం చేసినప్పుడే ముఖాన్ని కడుగుతుంటారు. ఆ తర్వాత ఎక్కడెక్కడో తిరిగొచ్చినా.. ముఖాన్ని మాత్రం కడగరు. ఇలా చేస్తే మాత్రం ముఖంపై డస్ట్ పేరుకుపోతుంది. దాంతో ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
men skin care
ఇకపోతే చాలా మంది అబ్బాయిలు ఎటైనా వెళ్లలానుకుంటే తరచుగా షేవింగ్ చేస్తూ ఉంటారు. షేవింగ్ తోనే అందంగా కనిపిస్తారని వాళ్ల ఒపీనియన్. కానీ తరచుగా షేవింగ్ చేస్తే మాత్రం ఆ స్కిన్ రాపిడికి గురయ్యి.. చర్మం పొడిబారుతుంది.
ఈ సమస్యను సీరియస్ గా తీసుకోకపోతే మాత్రం మీ ముఖం ఎందుకూ పనికిరాకుండా పోతుంది. కాబట్టి ఈ సమస్యలకు చెక్ పెట్టే, హ్యాండ్సమ్ గా మార్చే చిట్కాలను ఫాలో అవ్వండి. ఇందుకోసం ఎలాంటి టిప్స్ ను ఫాలో అవ్వాలో తెలుసుకుందాం పదండి..
ఆయిలీ స్కిన్ కోసం.. జిడ్డు చర్మం గల వ్యక్తుల ముఖం అందంగా మారిపోవాలంటే ఇలా చేయండి.. మూడు టీస్పూన్ల శెనగపిండిని తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ , కాస్త దాల్చిన చెక్క పౌడర్ ను వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక కరివేపాకు లేదా తులసి ఆకులో, ఒక ఇలాచీని కాసిన్ని గోరువచ్చని నీళ్లలో అర్థగంట సేపు నానబెట్టాలి. ఈ వాటర్ ను మిక్స్ చేసుకున్న శెనగపిండిలో వేసి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. ఒక పదినిమిషాల తర్వాత వాటతో తడుపుతూ మసాజ్ చేస్తూ.. శుభ్రంగా కడగాలి.
పొడిగా, జిడ్డుగా ఉంటే ముఖం కోసం.. వాతావరణ పరిస్థితుల కారణంగా ముఖం పొడిగా, జిడ్డుగా తయారవుతూ ఉంటుంది. అలాంటి వారు నిమ్మరసాన్ని రెండు చుక్కలు తీసుకుని అందులో పసుపును అరపావు టీ స్పూన్ పసుపు, జాజికాయం పౌడర్ ను వేయాలి. దీన్ని పక్కన పెట్టేసి.. గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో పావు టీస్పూన్ సోంపును , ఒక ఇలాచీని వేసి అర్థగంట పాటు నానబెట్టాలి.
ఆ తర్వాత ఈ వాటర్ ను జాజికాయ పౌడర్ లో కొద్ది కొద్దిగా పోస్తూ పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీన్నిముఖానికి అప్లై చేసి కాసేపు సమాజ్ చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లనీళ్లతో కడిగి శుభ్రంచేయాలి.