వీటిని తింటే మీ చర్మం ఎంత అందంగా మారుతుందో.. !
వయసు పెరిగేకొద్దీ.. మనం తినే ఆహారాలు మన చర్మాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మీకు ఎంత వయసొచ్చినా అందంగానే కనిపిస్తారు.

skin care
వృద్ధాప్యం అనేది ఒక సహజ ప్రక్రియ. వయసు పెరిగే కొద్దీ మన చర్మంపై ముడతలు, తలలో తెల్లవెంట్రుకలు రావడం, ఎన్నో అనారోగ్య సమస్యలు రావడం చాలా కామన్. కానీ చర్మం ముడతలు పడటం వల్ల అందమంతా తగ్గిపోతుంది. అయితే చర్మానికి తగినంత ముఖ్యమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తే చర్మం వృద్ధాప్యం తగ్గుతుంది. అంతేకాదు చర్మం అందంగా మెరిసిపోతుంది కూడాను.
food
వయసు పెరిగే కొద్దీ మనం తినే ఆహారాలు మన చర్మాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తినాలి. ఎందుకంటే ఇవి మీ వయసును తగ్గిస్తాయి. మీరు మరింత అందంగా కనిపించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఇవి చర్మంపై ముడతలను బాగా తగ్గిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇవి మిమ్మల్ని నిత్యయవ్వనంగా ఉంచుతాయి.
mushroom
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పుట్టగొడుగులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎర్గోథియోన్, గ్లూటాతియోన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పుట్టగొడుగులను క్రమం తప్పకుండా తింటే వృద్ధాప్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది.
పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో ఫుడ్ సైన్స్ ప్రొఫెసర్ రాబర్ట్ బీల్మన్ పరిశోధన ప్రకారం.. పుట్టగొడుగులు ఎర్గోతియోన్, గ్లూటాతియోన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే వనరుల్లో ఒకటి. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలతో ముడిపడి ఉంటుంది. పుట్టగొడుగులు పొడి చర్మాన్ని, నిర్జలీకరణ చర్మం, వృద్ధాప్య సంకేతాలు, చర్మ ఎరుపుదనం మొదలైన వాటితో పోరాడటానికి సహాయపడతాయని పరిశోధన వెల్లడిస్తోంది.
కొన్ని రకాల పుట్టగొడుగులను ఇప్పటికే కొన్ని సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తున్నారు. విటమిన్లు, పొటాషియం అధికంగా ఉండే కాంటెరెల్ పుట్టగొడుగులను అనేక జుట్టు సంరక్షణ ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇవి జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి.
పుట్టగొడుగుల్లో ఉండే ఈ ముఖ్యమైన భాగాలు చర్మాన్ని కూడా రక్షిస్తాయి. వీటిలో విటమి, ఖనిజాలను కలిగి ఉన్న సమ్మేళనాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది చర్మానికి పోషణ అందించడానికి బాగా సహాయపడుతుంది. పుట్టగొడుగుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. పుట్టగొడుగులు అల్జీమర్స్, గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.