తేనెతో ఈ చర్మ సమస్యలన్నీ మాయం..! తేనె మిమ్మల్ని ఎంత అందంగా చేస్తుందో
తేనె మన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును తేనెను ఉపయోగించి ఎన్నో చర్మ సమస్యలను పోగొట్టుకోవచ్చంటున్నారు నిపుణులు.
Image: Freepik
తేనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్ని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. తేనెను ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ ముచ్చట అందరికీ తెలుసు. అయితే తేనె కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందంటున్నారు నిపుణులు. అవును తేనెను ఉపయోగించి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. తేనె మన చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా చేస్తుంది. తేనెలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయని నిపుణులుచెబుతున్నారు. తేనెను చర్మానికి అప్లై చేయడం వల్ల స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది. మచ్చలు పోతాయి. మొటిమలు తగ్గుతాయి. అసలు తేనె మన చర్మానికి ఏ రకంగా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మాయిశ్చరైజర్
తేనె కూడా ఒక సహజ మాయిశ్చరైజరే. ఇది చర్మం తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. తేనెను చర్మానికి పెట్టినప్పుడు.. ఇది తేమను లాక్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మీ చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్ గా ఉంచుతుంది. పొడి చర్మం ఉన్నవారికి తేనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
honey
మొటిమలు
తేనెలో సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తరచుగా మొటిమలు అయ్యే చర్మం ఉన్నవారికి తేనె ఎంతో మేలు చేస్తుంది. దీన్ని మొటిమలపై అప్లై చేయడం వల్ల మంట తగ్గుతుంది. అలాగే మొటిమలు అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. తేనె మొటిమలు తొందరగా మానడానికి సహాయపడుతుంది. అంతేకాదు మొటిమల వల్ల అయిన రంధ్రాలను మూసేయడానికి కూడా తేనె సహాయపడుతుంది.
సున్నితమైన ఎక్స్ఫోలియేషన్0
తేనెలో తేలికపాటి ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి మన చర్మం పై పొరను సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేయడానికి సహాయపడతాయి. ఇది కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీంతో మీ చర్మం ప్రకాశవంతంగా, అందంగా కనిపించడానికి సహాయపడుతుంది.
మచ్చలు తగ్గడం
తేనెలో సహజ ఎంజైములు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి తేనెను క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేయడం వల్ల మచ్చలు, నల్ల మచ్చలు సులువుగా తగ్గిపోతాయి. స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుంది.
honey
యాంటీ ఏజింగ్ లక్షణాలు
తేనెలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అలాగే మీ చర్మంపై తేమను లాక్ చేస్తాయి. దీంతో ముఖంపై ఉన్న సన్నని గీతలు, ముడతలు తగ్గిపోతాయి. తేనె మీ చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది.