Aloe Vera: కలబంద మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా ట్రై చేయండి
Aloe Vera: కలబంద మొక్క ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు, బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా. ఇంట్లో ఉన్న అలోవెరా మొక్క సరిగా పెరగడం లేదని బాధపడుతున్నారా? అయితే ఆ మొక్క గుబురుగా, పచ్చగా ఎలా పెంచాలో తెలుసుకుందాం.
16

Image Credit : Gemini
ఏపుగా పెరగడానికి టిప్స్
ఆరోగ్యానికి, అందానికి కలబంద దివ్యౌషధం. అందుకే ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో పెంచుకుంటున్నారు. కొందరు నేల మీద నాటితే, మరికొందరు బాల్కనీ కుండీల్లో పెంచుతారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మొక్కలు వాడిపోతాయి. మీ బాల్కనీలోని అలోవెరా మొక్క గుబురుగా పెరగాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి.
26
Image Credit : Gemini AI
సరైన పాట్ ఎంపిక
చాలామంది ప్లాస్టిక్ బకెట్లు లేదా చిన్న కుండీల్లో అలోవెరాను పెంచుతారు. కానీ అలోవెరా వేర్లు లోతుగా కాకుండా, వెడల్పుగా వ్యాపిస్తాయి. అందుకే వెడల్పుగా, లోతు తక్కువగా ఉండే మట్టి కుండీలను ఎంచుకోవడం ఉత్తమం. కుండీ అడుగున నీరు పోవడానికి చిన్న రంధ్రాలు ఉండేలా చూసుకోండి.
36
Image Credit : our own
మట్టి మిశ్రమం
కుండీలో నీరు నిలిస్తే మొక్క కుళ్లిపోతుంది. కాబట్టి, కేవలం మట్టికి బదులుగా, మట్టిలో ఇసుక కలపండి. లేదా మార్కెట్లో దొరికే 'కాక్టస్ మిక్స్' (Cactus Mix) వాడొచ్చు. ఇది మట్టిలో నీరు నిలిచిపోకుండా చేస్తుంది.
46
Image Credit : chat gpt
సూర్యకాంతి
అలోవెరా మొక్కకు నేరుగా తగిలే ఎండ కన్నా, పరోక్ష సూర్యకాంతి (Indirect Sunlight) మంచిది. ఎండ ఎక్కువగా తగిలితే ఆకులు మాడిపోయి గోధుమ రంగులోకి మారతాయి. అందుకే బాల్కనీలో నీడ పడే ప్రదేశంలో కుండీని పెట్టండి.
56
Image Credit : instagram
నీరు పోయే విధానం
ఈ మొక్కకు ఎక్కువ నీటి అవసరం లేదు. కుండీలోని మట్టి పూర్తిగా ఆరిపోయినప్పుడు మాత్రమే నీళ్లు పోయండి. పదేపదే నీళ్లు పోయడం వల్ల కుండీలో తేమ పెరిగి వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.
66
Image Credit : gemini ai
ఎరువుల వినియోగం
అలోవెరా మొక్కకు తరచుగా ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు సేంద్రియ ఎరువు (Organic Fertilizer) వేస్తే చాలు. మొక్క ఆరోగ్యంగా, పచ్చగా పెరుగుతుంది.
Latest Videos

