pregnancy symptoms: టెస్ట్ అవసరమే లేకుండా మీరు గర్భవతి అయ్యారని ఇలా తెలుసుకోండి
pregnancy symptoms: ప్రస్తుత కాలంలో.. ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసుకోవడానికి ప్రతి మహిళా కిట్ ను ఉపయోగించడం సర్వ సాధారణం అయిపోయింది. కానీ కొన్ని లక్షణాలతో మీరు ప్రెగ్నెంట్ అని సులభంగా తెలుసుకోవచ్చు. అవేంటంటే..

వివాహ బంధానికి పరిపూర్ణత పిల్లల ద్వారానే కలుగుతుందంటారు పెద్దలు. అందులోనూ పెళ్లైన ప్రతి స్త్రీ తల్లికావాలని ఎన్నో కలలు కంటుంది. ఆ శుభ గడియల కోసం ఎన్నో మొక్కలు మొక్కుతుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది కూడా. అలాంటి పరిస్థితో ప్రెగ్నెన్సీ వార్త వినగానే ఆ కుటుంబమంతా ఎంతో సంతోషిస్తుంది.
అయితే ఇంతకు ముందే పిల్లలు ఉన్నవారు లేదా పిల్లలు కనడానికి ఎలాంటి ప్రణాలికలు వేసుకోని వారు .. గర్భం దాల్చితే దానిని అంత తొందరగా దానిని కన్ఫామ్ చేసుకోలేకపోతుంటారు. అయితే కొన్ని చిట్కాలు ప్రెగ్నెన్సీ టెస్ట్ అవసరమే లేకుండా మీరు గర్భం దాల్చారో లేదో చెప్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం లేవగానే వికారంగా అనిపించడం.. గర్భవతి అయిన ప్రతి మహిళలలో వికారం మొదటి లక్షణం. గర్భం దాల్చిన మహిళ ఉదయం నిద్రలేవగానే తల తిరుగుతుంది. అలాగే పరిగడుపున ఏదైనా తింటే వికారంగా అనిపించి వాంతులు అవుతుంటాయి. ఏ పనిచేయాలనిపించదు.
తరచుగా మూత్రవిసర్జన.. గర్బధారణ ప్రధాన లక్షణాలలో తరచుగా మూత్రవిసర్జన చేయడం ఒకటి. దీనికి అసలు కారణం ఆమె గర్భం దాల్చిన వెంటనే.. ఆమె గాల్ బ్లాడర్ లో పెద్దమొత్తంలో ద్రవం పేరుకుపోతుంది. దీంతోనే గర్భిణులు తరచుగా మూత్రానికి వెళుతుంటారు. ఇలాంటి సమస్య మీకు ఉంటే మీరు ఖచ్చితంగా గర్భం దాల్చినట్టేనంటున్నారు నిపుణులు.
పీరియడ్స్ సకాలంలో కాకపోవడం.. ప్రతి మహిళకు ప్రతి నెలా నిర్ధిష్ట సమయానికే పీరియడ్స్ వస్తుంటాయి. ఒకవేళ ఇలా కాకపోతే అది గర్బధారణకు సంకేతం కావొచ్చు. అలాంటి పరిస్థితిలో మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ ను చేయించుకోవడం మంచిది. అలా చేయకపోతే మీరు అవాంచిత గర్బధారణకు గురికావొచ్చు.
ఏ పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు.. గర్బం దాల్చిన మహిళ శరీరం మరింత వేగంగా ప్రతిస్పందించడం ప్రారంభిస్తుంది. దీంతో వీరు మరింత అలసిపోతారు. శరీరం నొప్పులు, బరువుగా కూడా ఉంటుంది. ఈ సమయంలో వారు ఏ పని చేయాలనుకోరు. ఇది గర్బవతి కావడానికి సంకేతం కావొచ్చు. ఇలాంటి వారు వెంటనే గైనకాలజిస్ట్ ను సంప్రదించడం బెటర్.
కడుపులో ఎప్పుడూ నొప్పి.. గర్భవతి అయిన వెంటనే ఆడవారిలో ఫలదీకరణ ఎగ్ స్త్రీ గర్బాశయం యొక్క గోడకు అంటుకుంటుంది. అలాగే అది నెమ్మదిగా లోపల పెరగడం మొదలుపెడుతుంది. ఈ కారణంగా వారి కడుపులో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి గర్భం దాల్చిన 6 నుంచి 12 రోజుల వరకు ఉంటుంది. కానీ చాలా మంది మహిళలు దీనిని సాధారణ నొప్పిగా భావించి దీనిగురించి పట్టించుకోరు. అందుకే ఇలా నొప్పి వచ్చినప్పుడు వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది.