eggs : వేసవిలో గుడ్లను తినాలా? వద్దా?
eggs : గుడ్డు సంపూర్ణ ఆహారం. ఇది మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. అయితే ఈ గుడ్డును వేసవిలో తినకూడదనేది ఒక అపోహమాత్రమే అంటున్నారు నిపుణులు. గుడ్ల వల్ల వేడి పెరుగుతుందనేది వాస్తవమే అయినప్పటికీ.. రోజుకు రెండు గుడ్లను తింటే ఒంట్లో వేడి ఏమీ పెరగదని నిపుణులు చెబుతున్నారు.

గుడ్డు కూర, ఉడకబెట్టిన గుడ్లు, ఎగ్ ఆమ్లెట్, చీట్ ఆమ్లెట్ ఇలా గుడ్డుతో ఏది చేసినా.. ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. ఈ గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే గుడ్డులో ఎన్నో పోషకవిలువలున్నాయి. ఇది సంపూర్ణ ఆహారం కూడా. వీటిలో విటమిన్ బి, విటమిన్ డి, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు, సల్ఫర్ ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడతాయి.
అయితే చాలా మంది గుడ్డును తింటే బరువు పెరిగిపోతామని.. గుడ్డు వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందని దీనివల్ల గుండెకు ప్రమాదమని అంటుంటారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు.
egg
వాస్తవానికి గుడ్డులో లిపోప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ కూడా. దీనివల్ల గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఎటువంటి నష్టం జరగదు.
అయితే ఎండాకాలం గుడ్లకు దూరంగా ఉండాలని చాలా మంచి చెబుతూ ఉంటారు. గుడ్లు వేడిని కలిగిస్తాయని, వీటిని తింటే మొటిమలు, కడుపు రుగ్మతలు వస్తాయని అంటుంటారు. ఇది కేవలం మీ అపోహ మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును.. గుడ్లను తింటే ఒంట్లో వేడి ఎక్కువవతుందని పూర్తిగా మానేయడం మంచిది కాదని సూచిస్తున్నారు.
గుడ్లు ఎన్నో పోషకాలతో కూడుకున్నవి. వీటిని తినకపోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు పూర్తి మొత్తంలో అందవు. అయితే ఒంట్లో వేడిపెరగుతుందని కొందరు వీటిని పూర్తిగా మానేస్తుంటారు. ఇలా చేయడం తప్పు. ఈ వేసవిలో కూడా రోజుకు రెండు గుడ్లను ఎలాంటి భయం లేకుండా తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఎండాకాలంలో రోజుకు రెండు గుడ్లను తింటే ఒంట్లో వేడి ఏమీ పెరగదట. రెండు కంటే ఎక్కువ గుడ్లను తింటేనే ఒంట్లో వేడి ఎక్కువవుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఎంచక్కా రోజుకు రెండు గుడ్లను తినండి. అప్పుడే ఈ ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు.
గుడ్లను తినడం వల్ల మీ వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు. గుడ్డును తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు ఎక్కువగా ఫుడ్ ను తీసుకోలేరు.
గుడ్లలో ఉండే ఇనుము ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి చాలా సహాయపడతాయి. ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. గుడ్డులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను తగ్గిస్తాయి.