MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Maha Shivaratri : ఈ జగతికి మొదటి శాస్త్రవేత్త పరమేశ్వరుడా..!

Maha Shivaratri : ఈ జగతికి మొదటి శాస్త్రవేత్త పరమేశ్వరుడా..!

Maha Shivaratri : కొత్తగా ఏదైనా కనిపెడితే.. వాళ్లను సైంటిస్టులుగా పిలుస్తున్నాం. అలా చూసుకుంటే పరమేశ్వరుడు కూడా ఈ లోకానికి మొదటి శాస్త్రవేత్త అవుతాడు. ఎలాగంటారా? భావ వ్యక్తీకరణ, సప్త స్వరాలు ఇలా ఎన్నో విషయాలు ఈశ్వరుని ఆవిష్కరణలే..

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 24 2022, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Maha Shivaratri : ఈ జగతిలో ప్రతి ఒక్కటీ భగవంతుని నియంత్రణలోనే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి . అందులో సర్వం శివునిలోనే నిండి ఉందని నమ్ముతారు. అందుకే కదా శివుని ఆజ్ఞ లేనిదే చీమలు కూడా కుట్టవంటుంటారు.  

27

ఈ భూమిపై ఉండే ప్రతి దానిలోనూ ఈశ్వరుడుంటాడనీ, సర్వం ఈశ్వరమయం అని ఈ పరమేశ్వరునికి ఎంతో మంది భక్తులున్నారు. నిత్యం ఈ పరమేశ్వరునికి పూజలు చేస్తూ.. సుఖ సంతోషాలతో ఉండేలా చూడమని ఆయన్ను కోరుతూ ఉంటారు. కోరిన వరాలను కాదనకుండా నెరవేర్చే దేవదేవుడిగా భక్తులచే పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు ఈ పరమేశ్వరుడు. 

37

మన పుట్టుక నుంచి మరణాంతరం మనం చేరుకునే వరకూ శివుడు మన ప్రతి చర్యలో ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ జగతికి ఈశ్వరుడే మొదటి శాస్త్రవేత్తగా పురాణాలు చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

47

భావ వ్యాక్తీకరణకు, చరిత్ర పుట్టు పూర్వోత్తరాలకు భాష ఎంతో ముఖ్యం. భాష లేకపోతే ఈ లోకం ఇలా ఉండేది కాదేమో. కాగా ఈ పరమేశ్వరుడు తన ఢమరుక నాదం ద్వారానే  భారతీయ భాషలకు మూలమైన 14 సూత్రాలను Create చేశాడని పురాణాలు చెబుతున్నాయి.
 

57

సంగీత విద్యాకు మూలమైన సప్తస్వరాలను శివుడే ఆవిష్కరించాడట. షడ్జమం ,రిషభం , గాంధారం , మధ్యమం ,పంచమం , దైవతం , నిషాదం లను వరుసగా నెమలి ,ఎద్దు, మేక, గుర్రం , కోకిల,కంచరగాడిద, ఏనుగు ల ధ్వనుల స్వాభావంతోనే ఆవిష్కరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి.
 

67

ఇకపోతే నృత్యవిద్య శివతాండవం ద్వారానే వెలుగులోకి తెచ్చాడట. తనలో సగం భాగం అర్ధాంగికి అంటూ పార్వతికి ఇచ్చి, గంగమ్మ తల్లిని తన తలపై పెట్టుకున్నాడు. వీటి ద్వారా మహిళలకు ఎంత గౌరవం ఇవ్వాలో ఈ లోకానికి చెప్పాడు. 

77

ఈ సమాజంలో భేధాలు, విభేధాలు, మనుషుల మధ్య అసమానత్వం రూపుమాపు కావాలని శివతత్వం ప్రసాదించాడట. పార్వతీ దేవే మొదటగా యోగవిధ్యను భోధించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.     

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఆకు కూరలు ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే…ఈ టిప్ ఫాలో అవ్వండి
Recommended image2
Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు
Recommended image3
Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved