MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ లైంగిక వ్యాధులు ఎలాంటి లక్షణాలను చూపించవు.. మీకున్నాయేమో చెక్ చేసుకున్నారా?

ఈ లైంగిక వ్యాధులు ఎలాంటి లక్షణాలను చూపించవు.. మీకున్నాయేమో చెక్ చేసుకున్నారా?

అసురక్షిత లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే ఎన్నో ప్రమాదకరమైన లైంగిక సంక్రమణ వ్యాధులొచ్చే అవకాశం ఉంది. కొన్నైతే ఎలాంటి లక్షణాలను చూపించవు. కానీ ఇవి చాలా డేంజర్ వ్యాధులు. 

2 Min read
Mahesh Rajamoni
Published : Apr 03 2023, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సెక్స్ తో బోలెడు లాభాలున్నాయి.. ఈ సంగతి పక్కన పెడితే సంభోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రక్షణ విషయంలో. ఎందుకంటే దీనివల్ల లైంగిక సంక్రమణ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొన్ని వ్యాధులు లక్షణాలను చూపినా.. ఇంకొన్ని మాత్రం ఎలాంటి లక్షణాలను చూపించవు. అందుకే మీరు అసురక్షిత లేదా సురక్షిత సెక్స్ లో పాల్గొన్నా.. తప్పకుండా వీటికోసం టెస్టులు చేయించుకోవాలి. ముఖ్యంగా కొత్తభాగస్వాములతో సెక్స్ లేదా ఫ్యూచర్ లో గర్భవతి కావాలనుకుంటే. ఎలాంటి లక్షణాలు చూపించబడని కొన్ని లైంగిక సంక్రమణ అంటువ్యాధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ)

కండోమ్లు కూడా నివారించలేని లైంగిక సంక్రమణ వ్యాధుల్లో ఇదీ ఒకటి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి దీనిబారిన ఖచ్చితంగా పడతారు. ఇది ఎలాంటి బాహ్య లక్షణాలను చూపించదు. కానీ ఇది లైంగిక సంపర్కం ద్వారా ఇతరులకు ఈజీగా సోకుతుంది. దీనిలక్షణాలు జననేంద్రియాలపై లేదా దాని చుట్టుపక్క చర్మంపై కనిపిస్తాయి. అంటే అక్కడ మొటిమల్లాగా అవుతాయి. 
 

36

ట్రైకోమోనియాసిస్

ఇది పరాన్నజీవి ద్వారా వస్తుంది. ట్రైకోమోనియాసిస్ ప్రపంచవ్యాప్తంగా 3.7 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ ఈ ఎస్టీఐ ఉన్నవారిలో కేవలం 30 శాతం మంది మాత్రమే దీని లక్షణాలను కలిగి ఉంటారు. దీనివల్ల జననేంద్రియాల్లో దురద, మంట, ఎరుపు, అసౌకర్యం, మూత్రవిసర్జనలో ఇబ్బంది, చేపల వాసన, యోని నుంచి ఉత్సర్గ వంటివన్నీ ట్రైకోమోనియాసిస్ లక్షణాలే. ఇవి గనుక మీలో కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 
 

46

గోనేరియా

ఎస్టీఐలల్లో ఇది వేగంగా వ్యాప్తిచెందుతుంది. ఇది నీస్సేరియా గోనోరియా బ్యాక్టీరియం వల్ల వస్తుంది. గోనేరియా సోకిన చాలా మంది మహిళలకు ఎలాంటి బాహ్య లక్షణాలు కనిపించవు. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అంటే దీర్ఘకాలిక కడుపు నొప్పి, ఫెలోపియన్ ట్యూబ్ అవరోధం, కటి మంట, ప్రెగ్నెన్సీ రావడంలో సమస్యలు వస్తాయి. 
 

56

క్లామిడియా

మహిళల్లో ఎక్కువగా కనిపించే ఎస్టీఐలలో క్లామిడియా ఒకటి. దీనిని సైలెంట్ సంక్రమణ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది సోకినా ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియల్ వాగినోసిస్ వంటి తక్కువ తీవ్రమైన ఇన్ఫెక్షన్ల వల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట కలుగుతుంది. కానీ దీన్ని చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. అందుకే ఉత్సర్గ, నొప్పి, మంట వంటి సమస్యలు వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 

66

జననేంద్రియ హెర్పెస్

జననేంద్రియాల నొప్పి, పుండ్లతో గుర్తించబడిన ఒక సాధారణ లైంగిక సంక్రమణ ఇది. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. ఇది పురుషులు, స్త్రీలు ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. ఇది జననేంద్రియాల్లో నొప్పి, దురద, పుండ్లు లక్షణాలను చూపిస్తుంది. కానీ కొంతమందిలో ఎలాంటి లక్షణాలను చూపించదు. ఇది ఓరల్ సెక్స్, యోని సెక్స్ వంటి లైంగిక కార్యకలాపాల వల్ల వస్తాయి. ఈ హెర్పెస్ రకం వ్యాప్తి చెందడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved