MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • High BP: వావ్.. నువ్వులు రక్తపోటును తగ్గిస్తాయా..?

High BP: వావ్.. నువ్వులు రక్తపోటును తగ్గిస్తాయా..?

High BP: నువ్వులతో అధిక రక్తపోటుకు చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందుకోసం వీటిని వివిధ మార్గాల్లో తీసుకోవచ్చు.  

2 Min read
Mahesh Rajamoni
Published : May 30 2022, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
blood pressure

blood pressure

High BP: ప్రపంచ వ్యాప్తంగా అధిక రక్తపోటు రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అందులో భారత దేశం కూడా ఒకటి. అందులో ఇది సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ సమస్యనే హైపర్ టెన్షన్ (Hypertension) అని కూడా అంటారు. 

28

ఈ Hypertension సమస్యను సకాలంలో నియంత్రించకపోతే గుండెపోటు (Heart attack), కొరోనరీ ఆర్టరీ డిసీజ్ (Coronary artery disease), ట్రిపుల్ వెసల్ డిసీజ్ (Triple vessel disease) వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. 

38

నువ్వులు రక్తపోటును తగ్గిస్తాయి.. హైపర్ టెన్షన్ తో బాధపడేవారు క్రమం తప్పకుండా నువ్వులను తింటే ఈ సమస్య పూర్తిగా తొలగిపోయి.. రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి. 
 

48

నువ్వుల రొట్టె (Sesame bread): అధిక రక్తపోటును తగ్గించడంలో అన్ని రకాల రొట్టెల కంటే నువ్వుల రొట్టెనే చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ నువ్వుల రొట్టే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా. ఇది హైపర్ టెన్షన్ సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది. 
 

58

సలాడ్ తో నువ్వులు.. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బరువును కూడా పెంచదు. సలాడ్ లో నువ్వులను కలిపి తీసుకుంటే అధిక రక్తపోటు సమస్య తొందరగా తగ్గిపోతుంది. 

68

నువ్వుల నూనె (Sesame oil).. ఒక వేళ మీరు హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నట్టైతే..  సాధారణ వంటనూనెకు బదులుగా నువ్వుల నూనెతో వండిన ఆహారాలను తీసుకోండి. ఈ నూనె మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులుు చెబుతున్నారు. దీనిలో ఉండే పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి. 

78

నువ్వుల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు.. నువ్వుల్లో ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, థయామిన్, జింక్, ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఇ, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. 

88

అంతేకాదు ఇవన్నీ క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. నువ్వుల్లో ఉండే ఔషదగుణాలు బ్రెస్ట్ క్యాన్సర్ (Breast cancer)ను నివారించడానికి సహాయపడుతుంది. నువ్వుల నూనె వల్ల గుండెపోటు (Heart attack) వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved