MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • World Asthma Day 2022 : ఆస్తమా పేషెంట్లు ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకుంటే కష్టమే..

World Asthma Day 2022 : ఆస్తమా పేషెంట్లు ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకుంటే కష్టమే..

World Asthma Day 2022 : ఆస్తమా వ్యాధి వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. దీనిని ముందుగానే గుర్తిస్తే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించొచ్చు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 03 2022, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

World Asthma Day 2022 : ఈ రోజు( మే 3 ) ప్రపంచ ఆస్తమా దినోత్సవం. ఇది  దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి. ఈ వ్యాధి ముదిరితే ప్రాణాలు కూడా పోవచ్చు. ఈ వ్యాధి ముసలి వాళ్లకు, చిన్నపిల్లలకు కూడా రావొచ్చు. గురక, ఛాతిలో భారంగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఈ వ్యాధి లక్షణాలు.  ప్రపంచ వ్యాప్తంగా దీని బాధితులు ఎంతో మంది ఉన్నారు.
 

210

ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే దీనిని పూర్తిగా నియంత్రించవచ్చు. ఆస్తమాకు.. వంశపారంపర్యం, పర్యావరణ సమస్యలు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. దుమ్ము, ధూళి కణాలు, పుప్పొడి, వాతావరణంలో మార్పులు ఈ ఆస్తమాను మరింత తీవ్రతరం చేస్తాయి.  

310
asthma

asthma

ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతుతో Global Initiative for Asthma (GINA) ఆధ్వర్యంలో ప్రతి ఏటా మే మొదటి మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వ్యాధి గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రారంభంలోనే దీనికి చికిత్సను అందించడం ఈ రోజు ముఖ్య లక్ష్యం. అయితే దీన్ని నివారించాలంటే కొన్నిజాగ్రత్తలను తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

410
asthma

asthma

తేమను నివారించండి..  ఆస్తమాతో బాధపడుతున్నట్టైతే మీ ఇంట్లో అధిక వేడి గానీ.. తేమ కలిగిన వాతావరణం గానీ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవి ఈ సమస్యను ప్రేరేపిస్తాయి. అందుకే ఎయిర్ కండీషనర్లను వాడండి. దీంతో తేమ తగ్గుతుంది. 

510

దుమ్ముకు దూరంగా ఉండండి.. ఆస్తమాను కలుగజేసే కారకాల్లో దుమ్ము కూడా ఒకటి. దుమ్ములో ఉండే పుప్పొడి రేణువులు ఉంటాయి. ఇవి ఎక్కువగా దుప్పట్లకు,ఫర్నీచర్ కు, దుప్పట్లకు పట్టుకుంటాయి. వీటిని ఉపయోగించినప్పుడు కూడా ఆస్తమా రావొచ్చు. అందుకే దుమ్ము పట్టిన తివాచీలను గానీ, కర్టెనర్లను, దుప్పట్లను శుభ్రం చేయానికి ముందుగా వాటిని వేడినీటిలో వేసి శుభ్రం చేయండి. అంతేకాదు ఆస్తమా బారిన పడకూడదంటే ప్రతి రెండు వారాలకోసారి మీ ఇంటిని క్లీన్ చేసుకోండి. 

610

బూజులకు దూరంగా ఉండండి.. బూజులు, మోల్డ్ వంటివి ఆస్తమాను కలిగించడంలో ముందుంటాయి. ఇవి ఎక్కువగా తొట్టెలు, కర్టన్లు, టైల్స్ వంటి వాటికి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తడిగా ఉండే బాత్రూం, వంటగదిలో ఇవి ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. అందుకే వీటికి దూరంగా ఉండటమే మంచిది. అంతేకాదు తడిగా ఉండే రూం లను తరచుగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. 

710
smoking

smoking

స్మోకింగ్ మానుకోవాలి.. ఆస్తమా ఉన్న వాళ్లు స్మోకింగ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆస్తమా పేషెంట్లు స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై చెడు ప్రభావం పడుతుంది. ఈ సమస్య ఉండే వారు సిగరేట్ కాల్చడం వల్ల గురక, దగ్గు వంటి సమస్యలు వచ్చి పరిస్థితి దారుణంగా మారొచ్చు. అంతేకాదు వీరు స్మోకింగ్ చేసే వారికి వీలైనంత దూరంగా ఉండాలి. పొగ వల్ల కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది. 

810
asthma attack

asthma attack

పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి..  పెంపుడు జంతువుల ద్వారా కూడా  ఆస్తమా మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పెంపుడు జంతువుల లాలాజలం, బొచ్చు, వాటి ఈకలు, జుట్టు వంటివి ఆస్తమాను కలుగజేస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండండి. అలాగే వీటిని మీరు యూజ్ చేసే ఫర్నీచర్, సోఫాలపై ఉంచకండి. 

910

ఆహారంలో మార్పులు అవసరం.. ఆస్తమా పేషెంట్లకు విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫ్లేవనాయడ్స్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండే ఆహారాలు మేలు చేస్తాయి. ముఖ్యంగా వీరు సేంద్రీయ కూరగాయలనుు, పండ్లను తింటే మంచిది. 
 

1010

ఆస్తమా పేషెంట్లు ప్యాక్ చేసిన ఆహారాలను తీసుకోకూడదు. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్ కూడా వీరికి అస్సలు మంచిది కాదు. పాలు లేదా పాల ఉత్పత్తులు ఆస్తమా పేషెంట్లకు అస్సలు మంచివి కావు. వీటిని తింటే మీరు అనారోగ్యం పాలవుతారు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Chapati Recipes: రాత్రి మిగిలిన చపాతీలతో చేసే 5 టేస్టీ వంటలు
Recommended image2
Tomato: ఏడాది మొత్తం టమాటాలు ఎలా నిల్వ చేయాలో తెలుసా?
Recommended image3
Flower Anklet: ఫ్లోరల్ డిజైన్ లో అందమైన పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved