నీళ్లలో ఇదొక్కటి కలిపి ఇళ్లు తుడిస్తే చాలు.. మీ ఇంట్లో ఒక్క ఈగ గాని బొద్దింక గాని ఉండదు
చిన్న పిల్లలున్న ఇంటిని రోజూ క్లీన్ చేయాలి. దుమ్ము, ఈగలు, బొద్దింకలు లేకుండా చూసుకోవాలి. అయితే నీటిలో ఒకటి వేసి ఇల్లు తుడిస్తే ఫ్లోర్ పై ఒక్క ఈగ కూడా వాలదు. అలాగే బొద్దింకలు కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు.
గదిని శుభ్రం చేసే చిట్కాలు
ఇళ్లు ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం అంతా బేషుగ్గా ఉంటుంది. అందుకే ఇంటిని తరచుగా క్లీన్ చేస్తూ ఉండాలి. కానీ ఇంట్లోని మరకలను, దుమ్మును, క్రిములను పోగొట్టాలంటే ఏదో దాన్ని వాడాలి. నిజానికి ఉప్పు నీటితో ఇళ్లు తుడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి తెలుసా?
ఇంటిని ఎలా శుభ్రం చేయాలి
ఇంట్లోని మరకలు, మురికిని శుభ్రం చేయడానికి ఉప్పు ఎంతగానో సహాయపడుతుంది. ఉప్పును నేలపై రుద్దడం వల్ల మరకలు సులభంగా తొలగిపోతాయి. అలాగే ఉప్పు క్రిమిసంహారక మందుగా కూడా పనిచేస్తుంది. ఉప్పు బ్యాక్టీరియా, వైరస్లను చంపేస్తుంది. న్యాప్కిన్ కూడా ఎంతో శుభ్రంగా కనిపిస్తుంది. చీపురు రంగు అస్సలు మారదు.
టైల్ ఫ్లోర్ ను ఎలా శుభ్రం చేయాలి
ఉప్పు నేలపై ఉన్న మురికిని, మరకలను ఇట్టే పోగొట్టడానికి సహాయపడుతుంది. ఉప్పు నీటితో టైల్ ఫ్లోర్ ను శుభ్రం చేయడం వల్ల మరకను సులభంగా పోతాయి. ఉప్పు నీటితో ఫ్లోర్ ను కడిగితే ఫ్లోర్ మెరిసిపోతుంది. ఉప్పు నీటితో తుడుచుకోవడం వల్ల నేలపై ఉండే బ్యాక్టీరియా, క్రిములు చనిపోతాయి.
వాటర్ క్లీనింగ్
ఉప్పును క్రిమిసంహారక మందులతో కలిపి ఇల్లును తుడిస్తే ఇంట్లోకి ఈగలు అసలే రావు. ఉప్పు నేల ఉపరితలాన్ని శుభ్రంగా, మెరిసేలా చేస్తుంది. ఇంటిని క్రమం తప్పకుండా ఉప్పునీటిలో తుడుచుకోవడం వల్ల ఇంట్లోకి ఒక్క ఈగ కూడా రాదు. ఉప్పు ఇంటిని శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
ఫ్లోర్ క్లీనింగ్
ఉప్పు పాజిటివ్ ఎనర్జీకి చిహ్నంగా భావిస్తారు. ఉప్పునీటితో కడగడం వల్ల ఇంట్లో పాజిటివిటీ వస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి సహాయపడుతుంది. ప్రతికూల అంశాల నుంచి ఇంటిని కాపాడుతుంది. ఇది చెడు కన్ను, ఇతర ప్రతికూల ప్రభావాల నుంచి మీ ఇంటిని రక్షిస్తుంది.